ఈ పుట ఆమోదించబడ్డది



28

అట్టి పండితు లట్టిజ్ఞానులఁ
బట్టి నాటితి జ్ఞానబీజము
పెట్టినీటిని దోహదంబుల

నెన్నొచేసితిని.

ఎట్టిఫలమని యడుగఁ బోకుము
ఇట్టె వచ్చితి నీటివలె నే
నట్టే గాలికిఁబోలె నెగిరితి

ననుటయే ఫలము.


29


ఏమిరా దౌర్జన్య మియ్యది
యేమి యడుగక యిందులోనికి
నేమి యడుగక యిచటినుండియు

గెంటుచున్నారు.

ఈ మధువు కూడదని చెప్పెద
రీ మధురరస మింత తనియఁగ
నేముత్రావుచునిట్టి యవమా

నమును మఱచెదము.

15

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/21&oldid=320608" నుండి వెలికితీశారు