ఈ పుట ఆమోదించబడ్డది
10
పోవనీ వారిష్టమైనటు,
దాన మన కేమిపని యున్నది
గాన 'కైకో బాదొ' 'ఖుసురో'
యెవ్వరైన సరే.
దానకర్లుఁడు 'హాతిముని' స
ఖ్యాన, 'రుస్తుము' వీర వాక్కుల
న్యూనతంబొందంగ నేటికి
లక్య మేఁటికిని.
11
ఒక్కఁడొక సుల్తానుగానీ
యొక్కఁడొక బానిసయుఁగానీ
యక్కడను బంగారుగద్దె ము
హమ్మదుండఁగనీ
ఒక్క ప్రక్కను నిసుక బయలును
ఒక్క ప్రక్కను సస్యభూమియు
నిక్కడను పచ్చికల మిాఁదను
గూరుచుందాము,
6