ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉజికెన = కవ్వము
ఉజ్జాయింపుగా = సుమారుగా
ఉటికలు = అప్పుడే పుట్టిన దూడ గిట్టలు
ఉటైకి పడడం = మోసపోవడం
ఉట్టి = పాత్రలు పెట్టుకునే వేలాడే చిక్కం
ఉడాకులు = బెదిరింపులు
ఉడ్డామూడు = అల్పసంఖ్య
ఉడ్డి కళ్లం = వేరుశనగకాయల కళ్లం
ఉడ్డికల్లము = వేరుశనగ కల్లము
ఉడ్డీలు = చాడీలు
ఉడ్డీలు = తంటాలు
ఉడ్డెండ్లు = =
ఉడ్డెము = పేరుకొన్న నెయ్యి
ఉతకడం = చితకబాదడం
ఉతకడం = బట్టలు శుభ్రంచేయడం
ఉత్త = వట్టి
ఉత్తచేతులు = రిక్తహస్తాలు, ఖాళీ చేతులు
ఉత్తపైన = దిసిగా, నగ్నంగా
ఉదము = మందము
ఉదరాబదరా = అసంపూర్ణంగా
ఉదెల = పందుల కాపు
ఉద్దర = ఉచితం
ఉద్ది బేళ్లు = మినప బేడలు
ఉద్దిపప్పు = మినపపప్పు
ఉద్దులు = మినుములు
ఉద్దె పారడం = భయంతో నిలబడిపోవడం
ఉద్దె బలగం = కొండంత చుట్టరికం
ఉద్దె బలగం = గొప్ప బంధుత్వము
ఉద్దెన = ఉద్ధరిణె, చిన్న గరిటె
ఉనిత్తము = ఇత్తడి కొమ్ము, (వాద్యము)
ఉపకలి = సానరాయి
ఉపనకం = ఒప్పందం
ఉపము = వెండ్రుక
ఉప్పకలు = నోట్లో వేసుకొని ఊసిన బియ్యం
ఉప్పుకొరినె = ఉప్పు కుండ
ఉప్పుతొక్క = చింతకాయ తొక్కుపచ్చడి
ఉప్పురాయి పుట్టదు = ఏమీ దొరకదు
ఉబలకాలు = వధూవరులు కూర్చునే కొయ్యలు
ఉమాదం = పిచ్చి
ఉమ్మిక = మంచపు కాళ్లకట్ట మధ్య కర్ర
ఉమ్మినీరు = ప్రసవనీరు
ఉమ్మెకరుకు కాలం = ఉప్పుకూడా పుట్టని కాలం
ఉరామారిగ్గా = దాదాపుగా
ఉరామారిగ్గా = అందాజుగా
ఉరిఉరెగా = అతిసాధారణంగా
ఉరిఉరెగా = ఉదరాబదరా
ఉరిఉర్రిగా = వగరుగా
ఉరికెత్తడం = పరుగెత్తడం
ఉరికెల్లేయడం = మాంసం వేలాడేసి ఎండబెట్టడం
ఉరివెలు = ఎంగిలి మెతుకులు
ఉరిసెన = పస్తు
ఉరిసెన = ఉపవాసం
ఉరుమంద = పశువుల మంద
ఉరువు లేకుండా = పత్తా లేకుండా
ఉరువు లేకుండా = ఆచూకీ లేకుండా
ఉరువు లేకుండా = కనపడకుండా
ఉరువులు = వస్తువులు
ఉరెపడడం = మొండికి వేయడం
ఉరెము = శేరులో ఎనిమిదో భాగం
ఉలకం = మోసం
ఉలకనుము = చిన్నదినము
ఉలవ పొక్కెన = ఉలవ పొట్టు
ఉలవాయి = బండిచక్రపుకుండలో ఇనుప వల
ఉలికారు కార్తి = వర్షపు సూచనలు లేని కార్తె
ఉలికొడ్డెము = పంతం నెగ్గాలనే పట్టుదల
ఉలికోడు = మెతక వ్యక్తి
ఉలిటెము = దేవతా విగ్రహాల ఆధార పీఠం
ఉలివాయి = మూర్ఛ
ఉలివెల్లిక = తూరుపార
ఉలెకలు = నాగమల్లె పొదలు
ఉలెపడడం = బెదరడం
ఉలెపడడం = ముందుకు రాబోవడం
ఉలేమిగా = సాధుస్వభావంతో
ఉల్లంతెన = శోభనం
ఉల్లగడ్డ = బంగాళాదుంప
ఉల్లతొక్కు = రుబ్బిన ఉలవపిండి
ఉల్లాకలు = గోరుచిక్కుడు కాయలు
ఉల్లాకలు = మొటిక్కాయలు
ఉల్లాపీలు = చిక్కుడుగింజల పొట్టు
ఉల్లిక = కోడిపుంజు తలపై జుట్టు
ఉల్లికరము = వెల్లుల్లి పై పొర
ఉల్లికలు = వెదురుబద్దలు
ఉల్లికాసము = ఎర్రగడ్డ పై పొర
ఉల్లిట్టెన = పాత్రపై మూత
ఉల్లె = గూడ(నీరు తోడే వెదురు బుట్ట)
ఉల్లె కప్పలు = పెద్దనల్లకప్పలు
ఉల్లె కప్పలు = గోదురుకప్పలు
ఉల్లెకంపు = కుళ్లిన వాసన
ఉల్లెడ = మేలుకట్టు
ఉల్లెలు = ఇంటిముందు అరుగులు
ఉవాచకెల్లడం = మొగమాటానికి పోవడం
ఉవెన = బలిష్టమైన కుక్క