ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేనాటి పలుకుబడులు
సేకరణ, సంకలనం
కోమలసాహితీవల్లభ
డా. కోడూరు ప్రభాకరరెడ్డి

రేనాటి పలుకుబడి ప్రామాణిక తెలుగు


అంకణం = ఆరడుగుల భూమి
అంగారము = అహంభావము
అంగారము = మదము
అంగీ = చొక్కా
అంగెము = తాళము
అంటించు = అతికించు
అంటేసుకో = వెంటాడి పట్టుకో
అండకు = దగ్గరకు
అండా = అన్నం వండే పెద్దపాత్ర
అంతరం = తేడా
అంతలక్కల = అన్నిచోట్ల
అంతుచూడడం = నాశనం చేయడం
అందాజగా = సుమారుగా
అందాజగా = ఉజ్జాయింపుగా
అందెన = పెంట, పియ్యి
అందెన = మలము
అందెరు పాప = మూడేండ్లు నిండని పాప
అందెలు = స్త్రిల మెట్టెలు
అంపించు = పంపించు
అంపెగోర్ణిమ = వెండి ఒడ్డాణము
అంబలి = పిండి,నూకలు వేసి కాచిన జావ
అంబల్ల పొద్దు = అంబటి పొద్దు
అంబేల్ = విశ్రాంతి
అక్కపలజం = దేవాలయ పైకప్పులో అమర్చిన రాతిబండ
అక్కముక్క కాయలు = మునక్కాయలు
అక్కిమాను = వేపచెట్టు
అక్కిలి = పత్తిగింజలు విత్తే సాధనం
అగదాళ్ల కట్ట = మంచపు కాళ్లకట్ట
అగముక్క = సన్నాయి వంటి వాద్యము
అగముక్క = సన్నాయి వంటి వాద్యం
అగాయిత్యం = అనవసర రభస
అగావు = మొండివైఖరి
అగుడు = దుష్ప్రచారం
అగుడు = పుకారు
అగుపడటం = కనపడడం
అగ్గవ = చౌక
అగ్గి = నిప్పు, మంట
అచ్చెము = వరుని బుగ్గ దిష్టిచుక్క
అజుకు = మధ్య
అటిక = పాలుపోసుకునే మట్టిపాత్ర
అట్టడి = వంతెన
అట్టుకెడడం = తీసుకు పోవడం
అట్లస్సి మాటలు = కల్లబొల్లిమాటలు
అడపము = ఆకువక్కల సంచి
అడపలడపలు = పెద్దపెద్ద ముక్కలు
అడిలి పోవు = హడలిపోవు
అడిలి పోవు = బెదిరిపోవు
అడుమానం = తాకట్టు
అడుసులు = జంఘలు, కాలిపిక్కలు
అడెంకోవడం = మల్లుకోవడం
అడెంకోవడం = చుట్టూ కమ్ముకోవడం
అడ్డగోలు = ఇష్టం వచ్చినట్లు
అడ్డరువులు = వ్యతిరేకపు సలహాలు
అణసర = అణగడం
అణసర = తగ్గిపోవడం
అతికెనం = మితిమీరిన తనం
అత్తరాసలు = అరిసెలు
అత్తెండ్లాట = చదరంగం వంటి ఆట
అత్తెర్ల కాపరం = ఇష్టం లేని కాపురం
అత్తెలు = చింతపిక్కలు
అదలాయించటం = దబాయించటం
అదలాయించటం = భయపెట్టటం
అదాట్న = హఠాత్తుగా
అద్దాలు = కళ్లజోడు
అద్దుమానం = అల్పం
అద్దుమానం = నీచం
అనపకాయలు = చిక్కుడుకాయలు
అన్నకుత్తి = అన్నం గరిటె
అన్నాలం = అన్యాయం
అన్నికె = మూకుడు
అపలకం = పీట
అపిపెద్దె = దేవుని గది
అపిపెద్దె = పూజగది
అప్పటమైన = కల్తీలేని
అప్పటాలకు = పందెం లేకుండా ఆడటం
అప్పనం = ఉచితం
అప్పనం = ఎల్లప్పుడూ
అబాపురి = పనీ పాటా లేనివాడు