ఈ పుట అచ్చుదిద్దబడ్డది

iv


కథావస్తువు రావువంశానుక్రమమే యైనను, సందర్భోచితముగా నాయా కాలముల పరిస్థితులు, నాచార వ్యవహారములు మొదలయిన పెక్కువిషయములు సైతము రమ్యముగా రచితములయినవి; కనుక, ఈ గ్రంథము కేవలము రావువంశము వారికిని వారి యాప్తుల కును మాత్రమే కాక తెలుఁగు వారి కెల్లరకును రుచింపఁగల కావ్యము.

శ్రీ పిఠాపురము మహారాజుగారు, సాహిత్య చక్రవర్తి, డాక్టర్ శ్రీ రావు వేంకట కుమార మహిపతి శ్రీ సూర్యరావు బహద్దరువారు తమ యాస్థాన కవిపండితులై యుండిన వేంకటకృష్ణ శాస్త్రి గారి యెడలఁ దమకుఁ గల యాదరము కొలఁదిని దక్కిన గ్రంథములతోపాటు నీ, గ్రంథమును సైతము ముద్రింపించి తెలుఁగువారి కృతజ్ఞతకుఁ బాత్రులైనారు.

మద్రాసు,
28.4.'50

గిడుగు వేంకట సీతాపతి.