ఈ పుట ఆమోదించబడ్డది

పదునాల్గవ ప్రకరణము

యచంద్రుని వృత్తాంతమటులుంచి యిఁక సంయుక్తంగూర్చి కొంతవిచారింతము. ప్రాణోపద్రవమునుండి తన్ను గాపాడిన మహాత్ముడు పృధివీరాజని నిపుణికవలన విన్న నాటంగోలె బంచప్రాణము లతనిపై నిడుకొని స్వయంవరమున కతఁడు వచ్చునో రాడో యనుతలఁపున వగలఁ బొగులుచు నిద్రాహారముల యెడసహితము మనాదరణఁ జూపుచుఁ దనయుపాద్యాయుని సంగతికూడ తెలియనందున నుత్కంఠయై దినములు గడుపుచుండెను. బయటి కేగివచ్చు ప్రతిపరిచారికను జక్రవర్తి యేతెంచెనాయని యడుగుచుండెను. ఇట్లు ప్రాణపదముగ నెంచుకొనుచున్న నారాజు నెడలఁ దనతండ్రి కావించిన యకార్యముఁ గూర్చి తెలిసినటులైన నామెహృదయ మెట్టి దశయందుండునో వచింప నలవిగాదుగదా? ఇటులుండ మంజరి చనుదెంచి

100