ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


యందు బండ్లు మొదలగునవి నడచునట్టి మధ్యమార్గమునందు గాక ప్రత్యేకముగ మనుష్యులు మాత్రమే నడచుటకుగాను సౌధపంక్తుల కంటుకొని యుండునట్లు నిర్మింపబడిన ప్రక్క దారులపొడుగున దాళ్వారము (అనగా గ్యాలరీ)ల బెట్టించి వాటిపై క్రిందనుండి మీదివరకుఁ జెక్కలగుపడని యంత దట్టముగ బలురకములగు బూలచెట్ల తొట్లుంచబడి యుండుటచే వీధియం దొకవైపున నిల్చి చూచువారలకు బచ్చని పొదలతో గూడుకొనియుండు కొండలోయ తలఁపునకు వచ్చుచుండెను. ప్రక్కదారులు పూలమొక్కలచే నిండియుండుటవలన మధ్యమార్గమం దిటునటు నొకగజము మేర జనుల రాకపోకలకు వదలి వీధిపొడుగునను దగ్గరదగ్గరగ నెత్తైన స్తంభములబాతి వాటి యగ్రములకు సమాంతరముగ నుండునట్లు తీగెలబిగించిరి. వెండియు నొకవరుసయందలి మొదటికంబపు చివరకును దాని యెదుటి వరుసయందలి రెండవ స్తంభాగ్రమునకును మరల మొదటి వరుసయందలి మూడవదాని కొనకును నిట్లే క్రమముగ నన్ని స్తంభముల యగ్రములకు గొంచెము మందములగు తీగెల నంటగట్టిరి. అట్లు కట్టిన తీగెల ప్రతియడుగునందు మైనపు వత్తులతో గూడుకొన్న గుండ్రములగు నాకుపచ్చ రంగుగల చిన్నచిన్న యద్దపు కలశముల వ్రేలాడదీయుటయేగాక చివరల బిగించిన తీగె లొండొంటితో గలియు భాగమున గాలిదీపము లుంచుటకు వీలైన పెద్ద పెద్ద గులోబులు వ్రేలాడ గట్టియుంచిరి. కలశములు గులోబులు నాకుపచ్చ రంగుగలవగుటచే రాత్రు

98