ఈ పుట ఆమోదించబడ్డది

పదమూడవ ప్రకరణము


పౌరు : కాలేదు. ఈ తొందరలన్నియు నడఁగిన తర్వాత నేమైన యీ రాజు మనదిక్కు చూచునేమొ.

బ్రాహ్మ : ఈ కల్లోలము లణఁగవలసిన యవసరమేమి ? ఈ లోపలనే బూడిదె రాసులతో గూడుకొని మన పల్లెలన్నియు నెమ్మదిగ నుండగలవు.

పౌరు : అయిన మనమిప్పు డేమిచేయుదము.

బ్రాహ్మ : అందరము గట్టగట్టుకొని యొక్క పర్యాయముగ యమునలో దూకుదము.

పౌరు : కానిండు. మన ఘోషలు ప్రధానితో విన్నవించు కొందము పదండి. అతడేమైన సాహాయ్య మొనరించిన సరి. లేకున్న నీవు చెప్పినట్లే సదిలో దూకుదము,

అని మాటలాడుకొని వారందఱు ప్రధానింజూడ వెడలి పోయిరి. కూతురు వచ్చినదను సంతోషమున ద్వరలో నామెకు వివాహమొనర్ప జయచంద్రుడు సకలదేశముల నృపులకు లేఖల నంపుచుండెనని యిదివరకే లిఖించి యుంటిమిగదా. తన్మహోత్సవమునకై గన్యాకుబ్జము బహుబాగుగ నలంకరింపబడెను. అత్యున్నతములై వరుసలుతీరియున్న సౌధపంక్తులు క్రొత్తగ వేయబడిన సున్నముచే స్వచ్చమగు వెండికొండల బారును దలఁపుకు దెచ్చుచుండెను. ప్రతి మందిరమునకు వేర్వేరుగ గాక రెండుప్రక్కల సౌధంపువరుసల యొకకొననుండి మరియొక కొనవరకు బచ్చని యాకుతోరణముల వ్రేలాడగట్టిరి, రాజవీధి

97