ఈ పుట ఆమోదించబడ్డది

పదమూడవ ప్రకరణము


ఇవి యెక్కడి గుఱ్ఱాలు. రాజమార్గము పట్టకుండ జనుదెంచుచున్నవి. ఇంతకుముందు చనుదెంచిన కోసలపతి సేనాసంరంభములో నావెంటవచ్చిన యితరగ్రామస్థులు వేరైపోయినారు. ఈ సంరంభములో నాకు నా జీవమునకు నెడబాటు కలుగు నటులున్నది. ఓయిదేవుడా! ఈ సంకులమునుండి దప్పించి నావారిఁగనుబఱచి కొంపజేర్చితివా ఈవివాహమై నగరమంతయు నెమ్మదిపడువరకు బయటనొక్క యడుగైనఁ బెట్టను. ఓహో ! అప్పుడే చేరువకు వచ్చినవే గుఱ్ఱములు" అని యొకముసలి బ్రాహ్మణుడు తనచేరువనున్న వారివలన మార్గమునజను రాజవరుల వృత్తాంత మడిగి తెలుసుకొనుచు నాయాసమును దీనత్వమును దోప గన్యాకుబ్జనగర రాజవీధి ద్రిమ్మరుచుండెను, తిరుగుచున్నప్పుడు వచ్చుచున్న రాజుగారెవరని యడుగ జెంతనున్న యొకఁడు కాశ్మీరపురాజని బదులుచెప్పెను. అంతనా నృపుని వీక్షించు నభిలాసతో, దాను బ్రక్కకొదిగి నిలిచి యుండెను. తరువాత నొకబలిష్టమగు నశ్వముపై రౌతుకూరుచుండి వీధివెడల్పున నాడించు కొనుచువచ్చెను. వానిపిమ్మట నొకయుత్తమ పారసీకంబుపై నేనాపతి వచ్చుచుండెను. వాని యనంతరము బారులుగట్టి యాశ్వికులు కొందఱురుదెంచు చుండిరి. వారి వెన్నంటి మఱియొకసేనాని కాంభోజమునెక్కి చనుదెంచు చుండెను. తదనంతరము శ్వేతాశ్వముల నారోహించి భటు లనేకులు ఖడ్గపాణులై యేతెంచుచుండిరి. వీరివెనుక శ్రేష్టములగు వనాయుజములపై నక్షోహిణీపతులు ముందునడువ గొంత

95