ఈ పుట ఆమోదించబడ్డది

రాణి సంయుక్త


జేయుటయేగాక ముక్కులలోఁ గన్నులలో జొరఁబడి దృష్టిని గూడ నాశనముఁ జేసివైచినది. రాత్రియంతయు నిద్రఁగాచిన వానికింబలె గన్నులు భగ్గున మండుకొని పోవుచున్నవి. ఈ యెడతెగని గుఱ్ఱముల గెట్టెలవలన గలుగు పటపటధ్వనులచే జెవులు గడియలు పడిపోయినవి. ఒక్కొక్క వరుసవచ్చికడచి పోవువరకు నీ మిడియెండలో నిలువవలసి వచ్చుటచే నా తాతలు దిగివచ్చుచున్నారు. పైననెత్తి క్రిందకాళ్లు మలమల మాడుచుండ వచ్చిన సవారీలవరుస పోవువరకుఁ బ్రాణముల బిగబట్టుకొని నిలవవలసినదేగాని కొంచెమిటుఁనటు గదిలిననే గుఱ్ఱముల కాళ్ల క్రిందబడి యీల్గుదునో యనుభయమే. పోనీ యేపంచనైన జేరుదుమా యన్న నన్నింటియందు ద్వారపాలకులే. దూరమున నుండగనే యెవరువారని కేకలువైచుచు వెడలగొట్టుదురుగాని పాపమెవడో ముసలి బ్రాహ్మణుఁడని దయదలఁచి పిలుచు ముండవాఁడొకఁడు గానరాఁడు. అయ్యో! రాకరాక వివాహ సమయములో మేమేలవచ్చితిమి? ఇప్పుడీ జయచంద్రుడు మావాక్యములాలించి మమ్ము బీడించుచున్న మేచ్ఛులఁ బారదోలునని తోచదు. దేశమందలి ప్రజలు క్రూరులగు మ్లేచ్చుల బారింబడి బ్రాణమానముల గోల్పోవుచుండ నీ రాజేమియుఁ బట్టించుకొనకుండ నిట్లుత్సవములలో మునిఁగియుండుట మాబోటి పౌరుల దురదృష్టమేకాని వేరొండుకాడు. అయ్యో! ఈరోజున నా గ్రహచారము బాగుగ నుండలేదు. నేనిటు మొత్తుకొను చుండగనే మఱియొక సైన్యము సంప్రాప్తమైనదే. నాయనో !

94