ఈ పుట ఆమోదించబడ్డది

పదమూడవ ప్రకరణము

"అబ్బబ్బ! ఈదినముదయముననే లేచి యెవరిముఖము గాంచితినో కాని నాకన్నియు బక్కులే సంప్రాప్తములైనవి. మాకక్కడఁ బల్లెలందు మ్లేచ్ఛు లొనరించుచున్న యార్భాటము లెటులున్నవో యిక్కడ నీ స్వయంవరమునకు వచ్చిన రాజులాయార్భాటము లటులున్నవి. సుమారు రెండుజాములవేళఁ దూర్పు వీధి వదలితి. మూఁడుజాములు తిరిగిపోయినవి. ఇంతవరకు రాజద్వారము చేరుటకు వీలుపడలేదుగదా ! కొండలవలె తండ తండములై పరువెత్తుకొనివచ్చు నీపాడుబగ్గీలు నేఁడు నాదుంప ద్రెంపినవి. రోడ్లమీద నీళ్ళుచల్లుబండ్ల తొత్తుకొడుకు లెప్పుడు చల్లిరోగాని యీగుఱ్ఱముల రాపిడివలన నేలంతయు నెండిపోయి దుమ్ము వెదజల్లుచున్నది. శకటముల సంరంభముచే నెగురు ధూళి యంతయు వీధులగుండ గ్రమ్ముకొని దారిగాన్పింపకుండఁ

93