ఈ పుట ఆమోదించబడ్డది

రాణి సంయుక్త


పరాక్రమముతోడనే పోరుచుండిరి. ఎట్లును బయటివస్తువులు లోపలికివచ్చు మార్గము లేనందున దమ కపజయము గలుగుననియే కుతుబుద్దీన్ దలవయుండెను. మఱిరెండు దినములకు రణసంరంభము వలనను క్షుద్బాధవలనను సైన్యములో మూడు వంతులు నష్టమయ్యెను. ఆ సమయమందే రాజపురుషుండొకడు మరికొంత సేనతో నార్యులకుఁ దోడ్పడవచ్చి హెచ్చరికఁ గలుగజేసెను. రాజదర్శనమువల్ల నుప్పొంగి యార్యసేనాగరము విజృంభించి పనిజేయసాగెను. ఎట్టకేలకు దక్షిణమందలివారు ద్వారమును నాశనముజేసి లోపలబ్రవేశించి మ్లేచ్ఛుల ధ్వంసము జేయజొచ్చిరి. తనవారంద రిట్లు మృతినొందుచుండుట వీక్షించి యిక నాలస్యమొనరించిన ప్రాణాపాయము గలుగునని కుతుబుద్దీన్ శత్రువుల కంటబడకుండఁ దప్పించుకొని పరువెత్తెను. హెచ్చరిక గలుగజేయువారు కానరానందున మ్లేచ్చులును జెల్లాచెదరై యిష్టమువచ్చినట్లు పరువెత్తసాగిరి. కొందఱు కంచెలం బడి మడసిరి. మఱికొందఱు బయటికేతెంచి యట కాచుకొని యున్న ఆర్యుల వాతఁబడి చచ్చిరి. కొంత సేపగునప్పటికి శతుసైన్యము నాశనమై యెదిరించువారు లేకపోవుటచే యుద్దమాపుదల చేయబడెను. మూడువేల మహమ్మదీయ భటులు ఖైదీలుగఁ బట్టుకొనబడిరి. శత్రువుల తుపాకులు, నాయుధములు, దక్కిన యుద్ధసామగ్రులన్నియు నార్యుల పాలఁబడెను. ఇట్టి మహా విజయముతో నా జయచంద్రుఁడు తన సైన్యముం గూడుకొని నిజరాజధానికిఁ బయనమైపోయెను.

92