ఈ పుట ఆమోదించబడ్డది

పం డ్రెండవ ప్రకరణము


సంజ్ఞ నొనర్ప నార్యభటులందఱు నొక్క పర్యాయముగఁ తుపాకుల మ్రోయించి దక్షిణద్వారపు ముట్టడిని బ్రారంభించిరి. తుపాకుల మ్రోతలకు లోపలివారెల్లరు భయభ్రాంతచిత్తులై లేచి తమతమ యాయుధములఁ దుపాకులఁబూని ద్వారముకడకేగిరి. బురుజులపై సుండవలసిన వారును మేల్కని నిద్రకండ్లతో మెట్లెక్కబోయి పడుచు నతిప్రయత్నము మీదఁ బైకిచేరి బందూకులతో నార్యసేనలఁ గాల్వసాగిరి. బురుజులపైనుండి వచ్చు బందూకుల వ్రేటుల కనేకులు నీటంబడి కొట్టుకొని పోవు చుండిరి. ఎటులైనను లోపలవారి నుక్కడించుకోరిక నార్యులు శత్రువుల వ్రేటులకు లక్ష్యముసేయక తమవారలు కుప్పలుగు గూలుచున్నను ధైర్యమువీడక సాహసముతో మ్లేచ్చులపై నగ్నివర్షము గురిపించుచు మహా ఘోరమున యుద్దమొనరించు చుండిరి. లోపలివారు ప్రయోగించు బందూకుల గుండ్లన్నియు యమునంబడి మహా భయంకరముగ శబ్దించుచుండెను. ఆవరణము లోపలఁ జేరుటకై దక్షిణమందలి వారలును హోరాహోరిగ. బోరాడుచుండిరి. ఈ తరుణమందే మహమ్మదీయుల కొఱకు సామానుబండ్లు కొన్నివచ్చి యవతలిగట్టు జేరెను, అక్కడినున్నవారు వచ్చినవారి ననాయాసముగ నోడించి బండ్ల నన్నింటి తమ వశము గావించుకొనిరి. ఈ ప్రకారము మూడు దినములవర కతిఘోరముగఁ బోరాడుచుండ లోపలివారల కాహార పదార్థములు తక్కువగుటచే వారందఱు భీతినొంద సాగిరి. అట్లయ్యును రెండుమూడు దినములవరకు మ్లేచ్చులు

91