ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


కొక సిఫాయి కోపోద్దీపితుఁడై తన లాఠీకఱ్ఱఁ జేఁబూని బండ్లవారి నందఱిఁ జావఁదన్న మొదలుపెట్టెను. మఱికొందఱా సిపాయిని శాంతఁబఱచి యావలకుఁ గొంపోయి బండ్లుకట్టుఁడని యాజ్ఞాపింప వారలు " అయ్యా ! నేఁడు వర్షము మిక్కుటముగఁ గురిసినందున నేలయంతయు నానియున్నది. కాన బండ్లు నడువఁజాలవు. మరల రేపు నాలుగుగంటలకేఁదప్ప యిప్పుడు కట్టుటకు వలనుపడదవి " విన్నవించుకొనిరి. అందులకు సిపాయిలును సమ్మతించి నాలుగు గంటకవేళ భోజనములు చేసికొనియే బయలుదేరిరి. కొన నా రాత్రి యింతవర్షములో వేరొక చోటికిఁబోవ నేటికని యా వృక్షముక్రిందనే మఱునాటి వరకునుండ నిశ్చయించుకొనిరి. చలి యమితముగ నుండుటచే బండ్లవారలచేఁ దడిసిన యెండుకట్టెలఁ దెప్పించి ప్రోవు వేయించి తామువెంట గొనితెచ్చిన యాముదముఁబోసి మంటఁజేసిరి, ఆముదపుఁ బ్రభావమున నా కట్టె లెగాదిగ మండుచుండ నందఱు దానిచుట్టుఁజేరి చలికాచుకొనసాగిరి. కొందరు వర్షము కురియుచుండ బండ్లయడుగునఁ గూరుచున్నప్పుడు మీదఁబడిన మంటిజల్లులఁ గడుగుకొన దుస్తులఁదీసి లంగోటీల బిగించుకొని నదికేగ బయలు వెడలిరి.

10