ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


కొన్ని నదియందుదిగి నిశ్శబ్దముగఁ దీరము జేరవచ్చుచుండెను. అదివరకా స్థలమున మ్లేచ్చులు రెండునెలలనుండి విడిసియుండ నే తొందరలును గలుగక పోవుటచే నేనాపతి హాయిగ ద్రాగి పరుండెను. తక్కుంగల సైన్యభటులును దమతమ శస్త్రాస్త్రముల నెక్కడి వక్కడఁ బారవైచి నిద్రపరవశులై యుండిరి. తెప్పలపైఁ గావలిగాచువారు సహిత మొకరిద్ఱఱి నన్నిటికి గావలిఁబెట్టి తాము లోపలజేరి పరుండియుండిరి. ఆ యొకఱిద్దఱును నదీతీరమున నొక యిసుకతిన్నెపై బరుండి “చల్లగాలికి హాయిగ నిదురవోయిరి. బురుజులన్నియు భటవిహీనములై నిద్దురబోవుచుండెను. అట్టి సమయమున పైననార్యసైన్యములు నదీతీరమున బారులుదీరి నిలిచియుండ గొందఱు భటులు నది నీది మ్లేచ్చులున్న వైపుజేరి యట నిదురించియున్న నిద్దఱ దీర్ఘనిద్రాసౌఖ్య మనుభవింపుడని నీటఁబారవైచి తమ్మునాటంక పఱచువా రొక్కరును గానరానందునఁ దెప్పల నవతలకుఁ గొంపోయి తమ సేనాభటుల నెక్కించుకొని వచ్చి మహ్మదీయుల ప్రాకారము చుట్టు జేర్చుచుండిరి. ఆర్యసేనాపతి దాని ద్వారమును గనిపెట్టి సేనయందు మూడవవంతు దక్షిణమును ముట్టడింపపంపి తక్కిన నైన్యమును దక్కిన మూడు పార్శ్వముల ముట్టడింప నాజ్ఞాపించెను. మఱియు బయటనుండి మహ్మదీయులకు సహాయమొనర్ప వచ్చినవారి నడ్డగించుటకుగాను మరికొంత సైన్యము నవతలి తీరముననే యుంచెను. ఏర్పరుచుకొన్న ప్రకార మెక్కడివా రక్కడ జేరియున్న పిదప సేనాపతి

90