ఈ పుట ఆమోదించబడ్డది

పండ్రెండవ ప్రకరణము


కలదు. శత్రువు లెవరైన లోపలబ్రవేశింప నెంచినచో నది నీది దక్షిణపు వాకిటఁ బోవలయుఁగాని వేరొండు మార్గములేదు. ఆవరణపుగోడ నాగజెముడు మొదలగు ముండ్ల దుబ్బులచే నిర్మింపఁబడి నాలుగు గజముల యెత్తు గలిగియుండెను. దక్షిణ మందలి ద్వారముమాత్ర మడుసుతోఁ గట్టఁబడి యుండెను. అచట శూరులగు భటులనేకులు గావలియుందురు. మఱియు నావరణము లోపల గంచెకొక గజమెత్తుగ నుండునట్లు మట్టి బురుజుల నందందు గట్టించి వాటిపై ఫిరంగులఁ బెట్టించి యనేక సిపాయిల గావలియుంచి యుందురు. ఈ కట్టుదిట్టములవలన సైన్యమంతయు నొక బలిష్టమగు దుర్గమున నున్నట్లే యుండెను. వెండియు. సైన్యమునకు వలసిన యాహార సామగ్రుల లోనఁ జేర్చుకొనుటకును దమవారి ననాయాసముగ దాటించుకొనుటకును వీలుగనుండునట్లు తేలికగు ననేక పెద్ద పెద్ద వృక్షముల నరికించి తెప్పించి తెప్పలుగట్టించి నీటద్రోయించి వాటిపై ననేక భటుల గావలియుంచి యుందురు. ప్రతి తెప్పయు రెండువందల టన్నుల భారమును మోయ గలిగినదిగా నుండెను. దూరమందున్న గొప్ప గొప్ప గ్రామముల కనిచి భటులచేత గావలసిన సామగ్రులఁ దెప్పించుకొనుచు వేగులవారి వలన నార్యావర్త యరాజుల తెఱంగుఁ దెలియుచు నతిజాగరూకుఁడై, యెప్పటివార్త లప్పుడు సుల్తానుగారి కెఱుక పరచుచు రణమునకై గుతుబుద్దీను వేచియుండెను. అట్టి తరుణమున నొకనాటి నిశీధమున రెండుగంటలవేళ నార్యసైన్యములు

89