ఈ పుట ఆమోదించబడ్డది

పండ్రెండవ ప్రకరణము

పైప్రకరణమున వచించిన వృత్తాంతములు జరుగుకాలమందే మధురాపురమున కెగువ రెండామడల దూరమందలి కాళిందీతీర ప్రదేశము లతిభయంకర యుద్దమున కావాసములై యుండెను. ఆ ప్రదేశములందు సుమారు ముప్పదివేల సైన్యముతో నెప్పుడు సమయము దొరుకునా యెప్పుడార్యావర్తమును మ్రింగివేయుదునా యని కుతుబుద్దీ నను మహమ్మదీయ సేనానాయకుఁడు గాచుకొని యుండెను. ఆ ప్రదేశముయమున కొండలగుండ బ్రవహించు చున్నందున నడుమ గొన్ని కొండలు ద్వీపకల్పములుగ మారియుండెను. ఎప్పుడుబట్టిన నపుడు శత్రులు బ్రవేశించుటకు సులభముకానట్టి ద్వీపకల్పముగనున్న నొక కొండపై ముప్పదివేల సైన్య ముండుటకు దగినంతవిశాలమగు నా వరణముగట్టించి కుతుబుద్దీనందు నివసించి యుండెను. ఈ యావరణమునకు దక్షిణపు పార్శ్వమున మాత్రమొక గొప్ప బలిష్టమగు ద్వారము

88