ఈ పుట ఆమోదించబడ్డది

పదునొకండవ ప్రకరణము


మేమహానుభావుని దర్శింప సభిలషించియుంటినో యట్టి నామనోకాంతుఁడు చేరువ కేతేరఁ దిన్నగఁ జూచుకొను భాగ్యము కూడ లభింపక పోయెను. చీ ! నా జడబుద్ది కానిమ్ము, గడచిన దానికింతగా వగవనేల? అని లోపలిగుట్టును నిపుణిక తెలుసుకొనిపోవునను తలంపున నప్పటికేమియు మాటలాడక నిద్రవచ్చు చున్నదని నిపుణికను బంపి తానును గొంతతడవునకు నిదురించెను. తరువాత జయచంద్రుఁడు కూతురు వచ్చినదను సంతసమున నామఱునాఁడు మొద లనుదినము బండుగ లొనరించుచు ద్వరలో నామెకు వివాహముగావింప నిశ్చయించుకొని సమస్త దేశాధిపతులకు వార్తాలేఖల నంపఁదొడగెను . సంయుక్త వెంటవచ్చిన పరిచారిక లిఁకమేము మానగరమున కేగెదము సెలవొసంగుఁడని రాణి మొదలగు వారినడుగ స్వయంవర మగువరకు నుండుఁడని నిర్బంధించిరిగాని కొన్ని యాటంకములు చెప్పి సమ్మతింపక సముచిత సత్కారములంది సంయుక్త మొదలగువా రూరిబయటివరకు వచ్చి సాగనంపఁ బయలుదేరిపోయి దారిలో దముకొఱకై కాచుకొనియున్న వారఁ గలసి జరిగిన సమాచారము లన్నియు సేనాపతులకు దేలియ బఱచిరి. అంత నక్కడి సేనాని కొందరి భటులఁ తోడితెచ్చి యా పరిచారికా జనంబుల స్వపురంబునకుబంచి మిగతసేననుం గూడుకొని తన రాజునకు దోడ్పడఁబోయెను.

87