ఈ పుట ఆమోదించబడ్డది

రాయసంయుక్త

అని హీనస్వరంబున బలుక నంతవర కా తన్విపడుచున్న సంతాపము జూచుచున్నదిగాన జాలినొంది మెల్లగ నిపుణిక యిట్లనియె.

"అమ్మా ! ఇత్తరి నీ యవస్తఁజూడ నాకు విచారము గలుగుచున్నది. తమసంగతి మీతో వచింపవలదని మా రాజు గారు గట్టి యుత్తరువు సేసియున్నారు. అయినను నీతో నిపుడు వచించెద: ఈ రహస్య మెచటను బయలు పెట్టకుము. ఆరాత్రి మిముఁదోడ్కొనివచ్చిన యాతడు ప్రస్తుతము డిల్లీని బాలించుచున్న పృధివీరాజు. ఉన్నట్లుండి యొకనాడు కొంతసేన నెచటికో పంపి యాక్షణమందే మమ్మందఱ వెంటగొని మిమ్ము దిగవిడిచిన చోటికారాత్రియే వచ్చి పనివారెల్లరు డేరాలు మొదలగునవి నిర్మించు తొందరలలోనుండ మాలోనెవరికి వచింప కెక్కడికో పోయి సుమారు నాలుగు గంటల వేళకు మిమ్ము గొనివచ్చి యటడించి మీకు సకలోపచారములు సేయ మా కాజ్ఞాపించి రెండుమూఁడు దినములు గడిచిన పిమ్మట గన్యాకుబ్జముఁ జేర్పవలసినదిగా గంచుకి మొదలగువారికిఁ దెలిపి తానప్పుడే కొంత సైన్యమును వెంటఁగొని ఎచటికో పోయినాడు. ఎక్కడి కేగినది నిజము మాకుఁదెలియదు కాని మనవెంటవచ్చిన సేనాపతులకు మాత్రము తెలియును. అని పృధివీరాజు వృత్తాంత మెఱుకబఱపగా సంయుక్త విచారమునఁ దనలో “హా ! నేనెంత మందభాగ్యురాల నైతి. చేతికందిన విధానమును బోగొట్టు కొన్నటు అయ్యెగదా నా బ్రతుకు. ఇన్ని దినములపర్యంత

86