ఈ పుట ఆమోదించబడ్డది

పదునొకండవ ప్రకరణము


నొక్క స్థలమందే శయనించిరి. అదివరకు గంటినిండ విద్రలేనందున నందఱు హాయిగ నిదురింపసాగిరి. కాని సంయుక్త వెంటవచ్చిన నిపుణిక యనునది మేలుకొనియుండి రాజకొమారికం గనిపెట్టియుండెను. సంయుక్తయుఁ బరున్నను నిద్ర రానందున దన మంచముపై లేచికూర్చుండి తమ కట సహాయపడిన మహత్ముని దిరిగి సందర్శించు భాగ్యము గలుగకపోయెనే యని చింతించుచు, బ్రక్క పైనుండిలేచి ఇటునటు సంచరించుచు మరల బాన్పుజేరి పవళించి వెండియు లేచి తిరుగుచు నాందోళమున నుండెను. ఈ విధమంతయు గాంచుచున్న నిపుణిక లేచి రాజపుత్రికను సమీపించి " అమ్మా! నీ వింకను మేలుకొనియే యున్నావా?" అందులకు సంయుక్త “అవును నా కింకను నిదుర రాలేదు." ఇటు రమ్మని తనదగ్గరకు బిలచెను, అప్పుడు వారిట్లు సంభాషింప మొదలిడిరి.

నిపు : అమ్మా ! ఇంతవరకు నే మాలోచించుచుంటివి?

సంయు ; ఏమియులేదు. నిద్రవచ్చునేమోయని యిటునటులదిరుగుచున్నాను. అంతియేగాక మమ్ము ఘోర విపత్సముద్రమునుండి దరిజేర్చిన యా పరోపకారపారణుని గన్నులార గాంచుటకైనను వీలుకలుగక పోయెగదా యను చింత నా మనంబున దృఢముగ నాటుకొని యున్నది. తుదకా యుత్తముని పేరైన విననోచుకోనైతి గదా!

85