ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


సంతోషమునఁ బరుగెత్తుకొని వచ్చుచుండిరి. ఈ లోపల నిట సంయుక్త సవారిదిగి మొదటిద్వారము గడచి రెండవద్వారము సమీపించుచుండెను. అప్పుడందఱు నొక్క పర్యాయముగ జనుదెంచి సంయుక్తం కౌగిలించుకొని గొల్లుమనసాగిరి. కొంతసేపటి కా సంరంభమణగి పట్టరాని సంతోషమున నానంద బాష్పములు రాలుచుండ నందరు నంతఃపురము జేరిరి. రాజ దంపతులు మహోల్లాసంబునఁ బరవశత్వమందుచు గొంతసేపటి వరకు గూతును గౌగిలించుకొనియే యుండి ముంగురులు దిద్దుచు " అమ్మా | తిరిగివచ్చి మా కండ్లయెదుటబడి మమ్మందఱ బ్రతికించితివా? తల్లీ ఇన్ని దినంబులు మమ్మెడబాసి యొంటరిగ నెటులుంటివి"వని యడుగ "దల్లిదండ్రులారా ! ముందు మంజరి మన్నింపుడు. మంజరి మూలమునే మిమ్మెల్లర మరలఁ గాంచు భాగ్యము గల్గినదని తమవృత్తాంత మంతయు నెఱుంగింప మితిలేని ప్రేమంబున నామెం దగ్గరకుతీసుకొని మంజరీ! నీ సాహసకార్యములకు మేమేమని పొగడువారము. ఆపత్కాలంబునకు మిత్రుడనుమాట నీవె సార్థక పరచితివి . నా ముద్దుకూనను రక్షించి మమ్మెల్లర బ్రతికించితివి ! మీ నెయ్యమును సార్థకము గావించుకొంటివి. భూమిపై బతికినంతకాలము మీ కట్టి స్నేహమే వర్ధిల్లుగాకని పలువిధంబుల నుతించి వెంటవచ్చిన దక్కినవారల కుపచారములొనర్ప తమ పరిచారికా జనంబుల నియోగించిరి. ఇట్లు కొంతవడి నిష్టగోష్ఠీ వినోదముల గడపి యనంతరము మృష్టాహారముల భుజించి యందఱు

84