ఈ పుట ఆమోదించబడ్డది

పదునొకండవ ప్రకరణము


"నమ్మా ! ఎప్పటికైన మాపై గరుణయుంచుఁ డంతియేజాలు" నని యతికష్టముమీద నామె నొడంబఱచి యా సవారీని మఱి నాలుగు పల్లకీలను బురము జేరంబంచి కంచుకి మరల తనవారిఁ గలయ వాఱందఱు వెన్కకేగి నగరమున కైదుమైళ్ళదూరమున నదీతీరమున విడిసియుండిరి. ఇట సంయుక్తయు పురమెల్ల దనకొరకై పరితపించుచున్న ప్రజలతో గూడి దీనదశయందుండ సాక్షాత్ లక్ష్మీవలె నందుఁ బ్రవేశించి పోవుచుండెను. పౌరులంద రీపల్లకీలగాంచి వింతిపడసాగిరి. రాజవీధియందుఁ గొంతదూర మేగినపిదపఁ గోటబహిర్ద్వారము సమీపించగాఁ బల్లకీల నటనిలిపి యందఱం దిగుడని సంయుక్త చెప్పెను. వీరందఱు కోటముందు దిగుట వీక్షించి కావలివారలు వచ్చి సంగతినడుగ సంయుక్త వచ్చినదని పరిచారకులు తెలిపిరి. వెంటనే యామెను జూడనైన జూడక పరమానందమున ద్వారపాలకులు లోనికిఁ బరువెత్తి యా సంగతి రాణివాసమున నెఱుకబఱచిరి. ఈ మాటవిన్న వెంటనే తమ కూతురెక్కడనో మృతినొందెనని తలచి తమ ప్రాణములపై సహిత మాశవదలుకొని పడియున్న రాజదంపతులు చివాలునలేచి " యెక్క డెక్కడ ? నిజముగ వచ్చినదా " యని ప్రశ్నింపఁ బల్లకీవచ్చి ద్వారమెదుట నున్నదని చెప్పుటతోడనే సంతోషవార్త దెచ్చిన యా ద్వారపాలకులపై దమ కంఠములందలి హారముల విసరివైచి త్వరిత గమనంబున బయటి ద్వారముకడకుఁ జనుదెంచు చుండిరి. తక్కిన చెలికత్తెలు నీ వార్తవిని యొడలెరుఁగని

83