ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


నకు సంసిద్ధులై యుండిరి. మూడుగంట లగుటతోడనే సవారి వచ్చి తమ యావాసమున కెదుట నిలువ వారిరువురందు నాసీనులైరి. బోయిలా సవారినెత్తుకొని ప్రయాణమైరి. ఈ సవారికి నాల్గువైపుల దాసీలు కూరుచున్న బల్లకీలు వచ్చుచుండెను. వీటియన్నింటికి ముందు శూరులగు భటు లుత్తమాశ్వములపై నడచుచుండిరి. వెనుకవైపున మఱికొందఱు దాసీలు కూర్చున్న బండ్లును వాటి యనంతరము సామాను బండ్లును నన్నింటి వెనుక నాశ్వికులును వచ్చుచుండిరి. ముందు వెన్కలఁగాక గుడియెడమ లందును బ్రసిద్ధులగు నాశ్వికులు కత్తులును, దుపాకులను ధరించి చనుదెంచుచుండిరి. ఇట్టి మహావైభవముతో నడువ నక్కడక్క డాగుచు నాలుగవనాడు చీకటిపడి యెనిమిదిగంట లగునప్పటికి కన్యాకుబ్బనగరప్రాంతముఁ జేరిరి. అంతట మరల కంచుకి సంయుక్త సవారివద్ద కేతెంచి " అమ్మా ! మనమిప్పుడు మీ నగరమున కరుదెంచినాము. పట్టణ మింకొక మైలు దూరముగలదు. పల్లకి బోయిలును, మఱికొందఱు దాసీలుదప్ప నితరులెవ్వరు పురముఁ జొరవలదని మా నృపుఁ డాజ్ఞాపించి యున్నాడు. మేమందఱ మిక్కడి కైదుమైళ్ళ దూరమున నిలిచియుండెదము. మీరు సురక్షితముగ నంతఃపురము జేరినవార్త మీ వెంటవచ్చిన దాసీలవలన మా కెఱుక బఱచుడు " అన “నా కింతటి సాయమొనరించి మా మన్నన లందకపోవుట న్యాయమగునా? మీ నృపుఁడిట్టి కట్టడియాజ్ఞల నే యుద్దేశ్యమున గావించెనోగదా?” యని సంయుక్త పలికిన

82