ఈ పుట ఆమోదించబడ్డది

పదియవ ప్రకరణము


మెవ్వరోవిని మరల నావద్దకు రానీకుండ నామెను బంధించిరో లేక యిట్టి కుతంత్రలఁ బన్నినందులకు వధించిరో యని సాహాయ్య మెనరించు వారెవరుసు లేకుండుటవలన దుఃఖసాగరమున మునిగితేలుచు బడియుంటిని. అనంతరము గడచిన రాత్రి నను బల్లకియందుఁ గూర్చుండబెట్టుకొని గుడియందు జేర్చిరి. గుడిలోవారు చేయఁగడిగిన కార్యముల వీక్షింపనోపక స్కృతిదప్పి పడిపోతిని. తరువాత వేరేమికావించినదియు నాకు తెలియదు. కొంతసేపటికీ గంభీరారావమొండు నాచెవులంబడఁ గన్నులు విచ్చితిని. అప్పుడే నీవు నాచేతికి ఖడ్గమొసంగితివి. పిదప జరిగిన దంతయు నీకు దెలిసియే యున్నదికదా. అని చెప్పి పరస్పరా శ్లేషణంబు లొనర్చుకొనుచు, చెప్పిన దానిని మరల చెప్పుకొనుచు దమకట్టి ఇక్కట్టుల గలుగజేసిన విధిని దూరుచు సంభ్రమాన్వితయై మంజరీ సంయుక్తలు తమ్మునిక్కడకు జేర్చిన రాజపురుషుడెవరా యని యతనిగూర్చి ముచ్చటించు కొనుచుండిరి.

79