ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


నాఁడెవరు లేని తరుణమున నొకతన్వి నాకడకేతెంచి విచారముతో "అమ్మా! నీ వెంత దురదృష్టవంతురాలవు. నీ వంటి సౌందర్యవతికిట్టి దుర్మరణంబు గలుగ జేసిన యా పరమేశ్వరు నేమన వలయు కటా ! నీ వెటులీ దుష్టులబారిఁ బడితివి నిన్ను రేపమావాస్య నా డిక్కడి కించుక దూరమున నున్న కాళికా శక్తికి సమర్పింపఁ గొని చనుదెంచియున్నారు. వీరందఱు నిన్న మాటలాడుకొనుచుండ వింటిని. నీ వాహారమొల్లకుండిన దారిలోనే మృతినొందుదువని యొక దుర్మాత్ము డేతెంచి నీతోఁగొన్ని మాయవాక్యము లాడినాడట. అదంతయు వట్టి యబద్దము. " అయ్యో ! నిన్నుగాంచిన నాకు విచారము గలుగుచున్నదని కన్నులనీరు పెట్టుకొనెను, నేను నించుక దుఃఖించి మరల ధైర్యము దెచ్చుకొని యామెతో "అమ్మా ! నీవు నా పుణ్యవశంబున లభించినావు. నేనొకటి వచించెద. అట్లు కావించితివా ధన్యురాల నగుదును. నాకుఁ జిన్నతనమునుండియుఁ గత్తిసాము నందలవాటుగలదు. ఎటులైన నొక ఖడ్గమును సంపాదించి తెచ్చియిచ్చితివా వీరందఱిపెఁ దిరుగబడి తప్పించుకొని యైనఁబోయెద, లేనిచోఁ బోరాటమున బ్రాణముల వీడెద. నా కీదుర్మరణము మాత్రము తప్పిపోవును " అన వల్లెయని యా కాంత వెడలిపోయెను, కాని మరల నింతవఱుకును నాకంటికిఁ గానుపించలేదు. ఆమె వెడలిపోవుటయే తడవుగ మఱికొందఱు నాదగ్గరకు వచ్చిరి. ఆమెకొఱకయి కొంతసేపటి వఱకు నిరీక్షించుచుండి యెంత సేపటికి రానందున మాసంభాషణ

78