ఈ పుట ఆమోదించబడ్డది

పదియవ ప్రకరణము


మిచ్చినది కాని తామెవరైనది, నన్నేటి కెక్కడకుఁ గొంపోయినది మొదలగువానికిఁ బ్రత్యుత్తర మీయదయ్యెను. ఈ విధ మంతయుఁ గాంచి నన్నేదో మోసముచేసి , చంపఁ గొనిపోవుచున్నారని దుఃఖార్తనై యెదుటఁ బెట్టిన వానిఁ దాకనందునఁ గొంత సేపటివఱకుంచి పిదప. దీసివైచిరి. తదనంతరము సాయంతరమందును నట్లే తెచ్చి యియ్యనపుడును వానినొల్ల నైతిని. బాగుగఁ జీఁకటి పడినతరువాత నొక పాడుసవారి యందు నన్నుఁ గూర్చుండఁ బెట్టుకొని రాత్రి యంతయు బ్రయాణము మొనరించి తెల్లవారునప్పటికి మఱియొక గ్రామముఁ జేర్చిరి. అచ్చటి కొకమానవుఁ డరుదెంచి నమ్మకము కల్గునట్లు నాతోడ తాము డిల్లీపురవాసులనియు నొక యధికారి యాజ్ఞను జక్రవర్తికి బహుమానముగ నిన్ను గొంపోవు చున్నారనియు వేరొండపకారము సేయుటకుఁ గాదనియు దిగులుమాని యాహారము భుజించుచుండుమనియు వచించెను. వాఁడు చెప్పిన దానివలన నాకు నమ్మకముఁగలుగక పోయినను నాకలి మిక్కిలి యగుటచే నానాఁడు దెచ్చినయాహార పదార్థముల గొన్ని రుచి చూచితిని. ఇట్లు రాత్రులందుఁ బ్రయాణము సేయుచుఁ దెల్లవారినతోడనే యొకగ్రామమునం దాగుచు నాలుగైదు దినములకు మధురాపురము సేర్చి యందొక విశాలమగు నింటిలోఁ జీఁకటి గదియందె నన్నుంచిరి. ఆగదిలోనున్న దినములందనేక పురుషులేతెంచి తిరునాళ్ల ప్రజలవలె ననుదినమును నన్నుఁజూచి పోపుచువచ్చిరి. మూఁడు దినములు గడచిన పిమ్మట నాల్గవ

77