ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


మధ్యమున పాడుడేరాయందు నల్గురు స్త్రీలనడుమ నుంటిని. విభ్రాంతిగదుర “ నేనిక్కడి కెట్లువచ్చితి. మీ రెవ" రని వారి నడుగ నొక్కరును నా మాటకు బ్రత్యుత్తరమీయరైరి, ఎంత పలుకరించినను మాటలాడకున్నతరి బయటికేగుదమని బయలుచేర, నన్ను రానీయక పట్టుకొనిరి.

ఛీ ! పాపినురాలా ! నా తండ్రిగారితోడఁ జెప్పి మిమ్ము శిక్ష నేయించెద, ననినను బెదరక నావచనములకుఁ బత్యుత్తర మీయక నేనొనరింపఁ బోవుకార్యములకు మాత్రఁ మాటంక బఱుచుచువచ్చిరి. అత్తరి వారిబెదరించి బయటఁ బడుదమని నా ఖడ్గమునకై వెదకికొన నదియెచ్చోటని గాన్పింప దయ్యెను. అంత నేమిసేయుటకును దోచకవారిపైఁ గలియఁబడి తప్పించు కొన నెంచియుండ భయంకరాకారులగు నల్గురు మనుష్యులు మఱికొందఱి స్త్రీలవెంటఁ గొనివచ్చి యటనుంచి జాగ్రర్తగ గనిపెట్టి యుండుడని హెచ్చరిక చేసిపోయిరి. నిరాయుధనై ప్రబలమగుఁ నాపదయందుండుటఁ దెలిసికొని నా యుద్యాన వనమున మంజరింగలసి నిదురించితిఁ గదా! నన్నొంటరిగ నెట్లు కొనివచ్చిరి? ఒక వేళ సాసఖిం గడదేర్చి తెచ్చిరో లేక నామెయు నావలెనే నిదురింప మోసపుచ్చి తెచ్చిరోయని పలుగతుల నిన్ను నాపితరుల దలఁచికొని యేడ్చి తప్పించుకొని పోవునుపాయము వెదకుచుండ మఱియొకతె కొన్ని యాహారపదార్ధములఁ గొనిదెచ్చి నా ముందుబెట్టి తినుమనెను. ఆమెయైన నా ప్రశ్నలకు జవాబునిచ్చు నేమోయని యడుగ నన్నిటికిఁ దగిన ప్రత్యుత్తర

76