ఈ పుట ఆమోదించబడ్డది

రాణి సంయుక్త


యిత్తురను సమాచారము విని యట్టి యదృష్ట విహీనయగుకన్య యవతెయై యుండునా యని యనుకొనుచు శక్త్యానుసారము నామెను రక్షించు తలఁపున బయలుదేరి యొక్కరీతి నడచుచు నీ సాయంతనముననే యొక పల్లియఁజేరి యక్కడివారల మధురాపురవృత్తాంతము లడుగ నక్కడి కేడుమైళ్ళదూరమున్న దని వక్కాణించిరి. ఆ మాటవిన్న వెంటనే మిక్కుటమగు నాకలియగుచున్నను, నంతవఱకు నడచియున్నందునఁబాదములు సత్తువదప్పి యున్నను లక్ష్యముచేయక సాహసమూని రాజమార్గమునంబడి నడచుచువచ్చి యా నగరము తొమ్మిది గంటలకు జేరితిని. అక్కడివార లింతకు మునుపే వామ మార్గులందఱు గొండకేగిరని వచింప దుఃఖార్తనై నా కష్టము ఫలింపదను తలంపున వించుక యోచించి వెంటనే యొక మనుజుడు దారిగనుపరుప గుట్టఁజేరవచ్చితిని. నే దగ్గరకేతెంచి చూచుటతోడనే తిప్పయంతయు దీపాలంకృతమై కడుమనోహరముగ నుండెను. కొందఱు గుంపుగఁజేరి యక్కడడుగు భాగమునఁ దప్పద్రాగి గేలింతల గొట్టుచుండిరి. వారేమి చేయుదురో యని దూరమందు నిలచి చూచుచుండ వారి త్రాగుడేమో వారేమో కాని దేవికాని పూజకాని యేమియు గనిపింపవయ్యెను. అంతట పైనొకగుడి దీపాక్రాంతమై యుంటఁ గని యక్కడ నేమిజరుగుచున్నదోయని క్రిందనున్న వారికి కొంచెము దూరముగ గొండనెక్కి గుడిని సమీపించుచుండ శంఖారావమును, జాగంటల చప్పుడులును నొక్కుమ్మడి వినవచ్చుచుండెను,

74