ఈ పుట ఆమోదించబడ్డది

పదియవ ప్రకరణము


కట్టెదుట నొకకుర్చీపై గూరుచుండియే యుండెను. తోడనే సంభ్రమాన్వితమై మంజరి, గౌగలించుకొని యబల కావున నించుక దుఃఖింపసాగెను. మంజరియుఁ గొన్ని యనునయంపు వాక్యంబుల నోదార్పఁ గలఁకదేరి "చెలీ ! నీవు నిక్కముగ మంజరివగుదువా? నా కేమియు భ్రాంతిచేకూర లేదుకదా? నీ విక్కడి కెటులేతెంచితి వన సంయుక్తా! నీ కింత భ్రమ యేటికి? నేను నిక్కముగ మంజరినే. నేనిక్కడి కెట్లువచ్చినదియు వచించెద వినుము. ఆ నాడు నీ వట్లు సోఫాపై నిదురింప గొంతసేపైన వెనుక మేల్కొలిపెదఁగాకని తలచుకొనుచు నేనును నట్లే నిదురించితి. అనంతరము సింహగర్జనమువలన మేల్కని చూడ నీవచ్చోటఁ గాన్పింపవైతివి ! వెంటనే వెతక వలసినచోట్ల నెల్లను వెదకి యెక్కడనుఁగానక జీవములపై నాసవదలుకొని దేశములమీద వేడలి నిన్నెట్లయిన గనుఁగొన విశ్చయించి యాడువేషమునఁ గ్రుమ్మరుట సురక్షితముగాదని పురుషవేషముదాల్చి, సమయముపడినప్పుడు పనికివచ్చునను తలపున రెండు చేతికత్తులఁ బదిలపఱుచుకొని యప్పుడే బయలు దేరితిని. అట్లు వెడలి ప్రతి గ్రామమునందు, నడుమఁ దటస్థపడు నరణ్యములందును నెమకుచు నచ్చటచ్చటఁ గొందఱివలనఁ కొన్ని సమాచారంబులఁ దెలియుచు సంచరించుచుంటిని. ఆట్లురెండుమూడు దినములు గడచిన వెనుక నొక యూరిలో మధురా నగరమునకు జేరువనున్న తిప్పపైని కాళికాశ క్తికి సకల కళాపరిపూర్ణయు సుందరాంగియునగు రాచకన్నియ నొక తెను బలి

73