ఈ పుట ఆమోదించబడ్డది

పదియవ ప్రకరణము

టులా రాజపురుషుండు డేరాయందు దిగవిడిచి చనుటతోడనే సంయుక్త యట నమర్పఁబడియున్న నొకపాన్పుమీద గూరుచుండి తనకిక్కట్టులు సంభవించుటయు వానినన్నిటిఁ గడచి బయటపడుటయు మొదలుగాఁగల తలంపులు మనస్సునకురాఁ గొంతసేపటి వరకు నేమేమొ యాలోచించు కొనుచు నలసి యున్నది గావునఁ బ్రత్యూషవాయువులు మేనుసోకుచుండ సుమా రైదున్నర గంటవేళ నించుక నిద్రఁగూర్కెను. వెంటనే మంజరి చనుదెంచి తన పార్శ్వమున గూరుచుండినట్లొక కలగని “హా! మంజరీ ఎన్నిదినములకు నిన్నుఁ జూడఁగంటినే" యని పలవరించుచు మంచముపై లేచి కూరుచుండెను. అట్లు లేచి కనులుదెఱచి వీక్షించిన తోడనే యా కన్యకుఁ గలిగిన సంతోషమేమని చెప్పుదును? నిజముగ మంజరివచ్చి తన

72