ఈ పుట ఆమోదించబడ్డది

తొమ్మిదవ ప్రకరణము


వదలుచుండిరి. అంతఁ గొంతవడికిఁ దమ్మెదురించువా రెవరును లేకపోవుటచే సంయుక్తా యౌవనవంతులిద్ద ఱొకచోఁజేరి నిలచియుండ రాజపురుషుండును జేరి వారిచేఁ బ్రణతులంది యా స్థలమంతయుఁ బీనుగుపెంటలతో భీభత్సముగ నున్నందున వారిని వెంటఁగొని వేరొకచోటికేగి యట యౌవనవంతుని హస్తమునకు చికిత్ససేయ నొక కళేబరముపై బట్టలాగి దానిఁదడిపి బిగించుటకై జలముకొఱకు వెతక నెచ్చోటను గాన్పింపఁదయ్యెను. అత్తరి సంయుక్త మరల గుడిలోపలికేగి యటఁ బురోహితుఁడు దేవికిఁ బ్రోక్షింపఁ బెట్టుకొనియున్న జల కమండలువును గొనితెచ్చెను. ఆ నీటియం దా గుడ్డను దడిపి గాయముపై బిగించికట్టిరి. అనంతర మా రాజపురుషుఁడు వారిద్దఱిం దోడ్కొని కొండదిగి పురమువైపునం గొంత దూర మేగి యట నొక బయలు ప్రదేశమున నిర్మించియున్న డేరాల బ్రవేశించి భటపరీవృతమగు నొక గుడారమున యౌవనవంతు నునిచి నడుమ నిర్మింపబడి యనేకులగు గావలివారలతో గూడుకొనియున్న మఱియొక గుడారమున నా కన్ని యం దిగవిడచి వారిద్దఱివద్ద సెలవుగైకొని వెడలిపోయెను.

71