ఈ పుట ఆమోదించబడ్డది

తొమ్మిదవ ప్రకరణము


సిద్ధముగనున్న పురోహితుని హస్తము నున్నదాని నున్నట్లే తునుమాడెను. తోడనే విభ్రాంతుఁడై పురోహితుఁడు నేలగూల సంయుక్తం బట్టుకొని యున్న ఇరువురు వేరొక గదికేగి యాయుధములంగొని యౌవన వంతునిపై దుముక వచ్చుచుండిరి.

ఈ లోపల నావచ్చిన పురుషుండు' "సంయుక్తా " యని కేకవైచి తనవద్దనున్న రెండవఖడ్గము నొసఁగెను. వెంటనే సంయుక్త ఖడ్గము నందుకొని యుత్తరప్రత్యుత్తరములకు సమయము లేనందున నా వచ్చిన మనుజుఁ డెవరైనదియు నెఱుఁగక పోయినను తనకు సాహాయ్యమొనర్పఁ జనుదెంచెనని యూహించి తానును బోరాడ సిద్ధమయ్యెను. వామమార్గు లిరువురిపై వారిరువురు లంఘించి యతినిపుణముగ వారిఁ దుదముట్టించిరి. ఈ కల్లోలమంతయుఁ గాంచి శంఖముఁ బూరించ నతడు బిరబిర గ్రింధికి బరువెత్తి యక్కడివారల కీసంగతిఁ దెలియఁబఱుపఁ దత్క్షణంబ వారును హుంకారము లొనర్చుచు బయలుదేరి గుడిఁ బ్రవేశింప గడఁగిరి. ఈలోపల గుడియందలి సంయుక్తా యౌవన వంతులు ద్వారమున కిరుపార్శ్వముల నిలచి వామమార్గుల నావరణము బ్రవేశింపకుండఁ జేయుచుండిరి. అతి ప్రయత్నము మీద గొంతసేపటికి వామమార్గులు లోపలం బ్రవేశించి యాయుధములతోఁ గొందఱు దండములతోఁ గొందఱు పోరాడసాగిరి, సంయుక్త యౌవనవంతు లిరువు రతిచమత్కారముగ ననేకులఁ జంపుచుండిరి. దేవి ప్రత్యక్షమై తమకు వరమొసఁగి స్వర్ణ

69