ఈ పుట ఆమోదించబడ్డది

రాణీసంయుక్త


లేదు. మనోహరా ! నీ యుత్సంగంబుస వసించు భాగ్యము దౌర్భాగ్యురాలనగుట నాకులేకపోయినది. పరమేశ్వర ! ఎన్ని జన్మములకైనను నీ హృదయనాథుడగు పృధ్వీరాజునే ప్రాణ కాంతునిగా నొనర్పు " మని తనవారి నందఱిఁ దలంచుకొని యొక్క పర్యాయమేడ్చి చేయునదిలేక నిరాధారయై వ్వాఘ్రముల మధ్యఁ జిక్కిన లేడివడువునఁ బడియుండెను, పురోహితుఁ డాదిగాఁగల తక్కిన నలుపురు తమతమ పూజాకార్యముల నెరవేర్పఁదొడగిరి. పురోహితుఁ డెఱ్ఱని పుష్పములతోడను, నక్షత్రములతోడను, మంత్రముల జపించుచు విగ్రహమునకుఁ బూజసేయుచుండెను. వేరొకండు రెండుమూడు బిందెల యన్నమును గుమ్మరించిదానిలో నెఱ్ఱని రంగుఁబోసి కలుపుచుండెను. ఇంకొకఁడు శక్తియెదుట నుండు గుండములో హీనవస్తువుల తుచ్ఛములగు మంత్రములఁ బఠింపుచు వ్రేల్చుచుండెను, ఆంత నర్థరాత్రము గావచ్చినందునఁ జేయవలసిన కార్యము లన్నియు జేసి యిరువురా కన్నియను లేపియెదుటకుఁ గొనివచ్చి నిలువఁబెట్టి యొరగిపడకుండఁ బట్టుకొనియుండిరి. నిర్జీవ ప్రతిమవలె నా కన్నియ నిలచియుండెను. ఒకడు శంఖముబూరించుచు గంట వాయించుచుండెను. పురోహితుండతి తీక్షణమగు గత్తినొకదానిం గైకొని మంత్రోచ్చారణము సలుపుచు నామె శిరంబుఁ దెగవ్రేయ సిద్ధమై యుండెను. అట్టి మహోపద్రవమగు సమయంబున తేజశ్ళాలియగు యౌవనవంతుఁ డొకఁ డతిత్వరిత గమనంబున గుడితలుపులు గుభాలున నెట్టుకొనివచ్చి తలదెగ వ్రేయుటకు

68