ఈ పుట ఆమోదించబడ్డది

తొమ్మిదవ ప్రకరణము


దీని కంతయు సత్య విద్యావిహీనతయే కారణము. విద్య నెఱుఁగని కతమున నీ మతస్థులందఱు దమపురోహితు లెట్లుచెప్పిన నట్లు నడచుకొందురు. అట్లు కొండయడుగు భాగముఁ జేరిన పిదపఁ బై కేగ నేర్పఁబడిన నలువురు పల్లకీబోయలు దప్పఁ దక్కినవార లక్కడే నిలచిపోయిరి. పురోహితుఁ డాదిగాఁగల నలువురు పల్లకిని గుడిలోనికిఁ బట్టించుకొనిపోయి శక్తియెదుట బెట్టించి బోయల వెళ్లుఁడన వారలును నట్లే వెడలి పోయిరి. అంత నా కన్నియపైనున్న ముసుగుఁ దీసివైచుట తోడనే యెదుటనున్న భయంకరమగు శక్తిని జూచి భీతచిత్తయై మూర్చిల్లి లేచి తన దురవస్థం దలఁచుకొని యణంచుకొన్నను దాగక తెర తెరయై వచ్చుచున్న శోకమున నిట్లు విలపింప సాగెను. " దైవమా ! నేను నీ యెడఁ గావించిన యపరాధ మేమీ ! నిర్హేతుకంబుగ నా కిట్టివ్యధ నేలఁ దెచ్చి పెట్టితివి? కలనైన నిట్టి దుర్మరణంబు నొందుదునని తలంచితినా? హా! తల్లిదండ్రులారా ! నావంటి నిర్భాగ్యురాలి మీ రేలఁ గాంచితిరి. మిమ్ము దరిలేని శోక సాగరంబున ముంచివైచితిఁ గదా ! మీరెంత పరితపించు చున్నారో ! హా ! మంజరీ !నీవంటి ప్రాణ సమానురాలగు సఖి మఱియొకతె దొరకుట దుర్లభము. నీ మాట వినకయే నిట్టి బెట్టిదములకు లోనైతిని. నీవు వచించిన ప్రకారము మందిరంబునఁ బరుండియే యున్న నాకీ ప్రాప్తి గలుగకుండును గదా : నే నెంత విలపించి యేమి ప్రయోజనము. తెగించి పోరాడుదమన్నఁ జేత నొక కత్తియైనను

67