ఈ పుట ఆమోదించబడ్డది

తొమ్మిదవ ప్రకరణము


యగునని తలఁచి తత్ప్రసాదంబు దానొక్కఁడే పాలుగొను వాంఛను లేచి యిట్లని వచింపసాగెను.

“సభికులారా! మీరందఱు శ్రద్ధతోనేవచించు వాక్యముల వినుడు. మనతర మందిదివర కెన్నడు నొసగఁనట్టి నరబలి యీ దినమున నియ్యఁబోవు చున్నాము. అందు సాధారణపు మానవుఁడు గాడు. సమస్త విద్యా సంపన్నురాలును సౌందర్యవతియునగు రాజుకూతురై యున్నది, అట్టియెడ మనమందఱము గుమిగూడిన నాలయమున మిక్కుటముగు నల్లరియగును. అదియునుంగాక రాత్రి నా కలయందు దేవి ప్రసన్నయై “నాకు బలి యిచ్చునపుడు నల్గురు మనుజులు దప్ప నెక్కువ యుండ గూడదు. అట్లున్న యెడల నాకన్యకను వదిలి మిమ్ములనే మ్రింగెద" నని వచించినది. కాన మీరందఱు గొండ యడుగు భాగమందే యుండుఁడు, దేవి ప్రత్యక్ష యైన వెంటనే యామె యనుజ్ఞఁ గొని మిమ్మందఱ బిలుపించెదను." అని నమ్మిక కలుగునట్లు వచింప “ నెద్దు యీనినదన్న దూడను గట్టివేయు" మను నంతటి బుద్ధిశాలులగు నా మూడు లందఱు వల్లెయని యతని వాక్యములకు సమ్మతించిరి. అంత గొంతవడికి సభ ముగింపుచేసి యెవరిండ్లకు వారు పోయిరి. సభ ముగియునప్పటికి నాలుగు గంటలయ్యెను. తరువాత గొందఱు పెద్దమనుష్యులు లెక్కలేక మధ్యభాండముల మోయించుకొని కొండమీది కేగి కొన్నింటి దేవి గుడియందుఁ బెట్టించి కొన్నింటి రాత్రికి దాము నిలువఁదలచుఁ కొన్న స్థలమునఁ బదిలము సేయించి

65