ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


మైనను శుభ్రపఱచుకొను శక్తిలేకయున్న దేవీ విగ్రహమునకు భక్తులందఱు మీఁదబడియున్న నెలుకపెంటలను దుమ్మును బోఁదుడిచి సీకాయరసముతో మడ్డినంతయుఁ గడిగి వెండికన్నులు మొదలగువాని నాయా చోటుల నలంకరించి తమ కోరికల ఫలింపఁ జేయునని తలచుచుండిరి. గాని యింత శక్తి విహీనమగు రాతివిగ్రహము మన వాంఛితముల నెట్లు నెరవేర్చునని యొక్కఁడును తలపఁడయ్యెను. అంతకు మునుపు మడ్డి పట్టియుండుట వలన నెటులున్నను కండ్లు మొదలగునవి చక్కగాఁదోమి యలంకరించిన పిమ్మట మాత్రము చూచిన వెంటనే వాంతులుపుట్టి చచ్చునంతటి భయము గొల్పుచుండెను. ఆముదముచే నంగుళమెత్తు మడ్డిపట్టియున్న దీపపు నెమ్మెలను ప్రమిదెలను బ్రయాసపడి తోమి గుడిలోపల వెలుపలనున్న గూండ్లయందును గుడినుండి క్రిందివరకున్న మెట్లకిరుపార్శ్వము లందలి పిట్టగోడలమీదను బెట్టియుంచిరి. మఱికొన్ని యగండముల నాలయములోపల శక్తియెదుట వ్రేలాడఁ దీసియుంచిరి. ఖడ్గముల సానబెట్టించి లోపల నొకగదియందు వ్రేలాడఁగట్టిరి. ఇంతలో నమవసయువచ్చెను. ఆనా డాబాలగోపాల మభ్యంగన స్నానము లాచరించి నూత్న వస్త్రధారణులై యుపవాసము నుండి సూర్యుఁడెప్పుడు క్రుంగునాయని వేచియుండిరి. ఆ నాడు మిట్టమధ్యాహ్నమం దొక పెద్ద సభగావించిరి, ఆసభయందు జారుఁడును, చోరుఁడును, విద్యావిహీనుండును, మూర్థాగ్రేసరుఁడును నగు వారి పురోహితుఁడు దేవి నిక్కముగఁ బ్రత్యక్ష

64