ఈ పుట ఆమోదించబడ్డది

తొమ్మిదవ ప్రకరణము

మూడవ ప్రకరణమున బేర్కొనిన మధురాపట్టణపుఁ దిప్పమీఁది కాళికా నిలయమునకు మఱియొక పర్యాయము మంచి దినములు గలుగుట సంభవించెను. అచ్చటివార లంద ఱమావాస్య పదిదినములున్న దనగనే గుడిని బాగుపఱచ నారంభించిరి. ప్రాకారపు గోడలకు, గర్భగుడి శిఖరమునకు సున్నము వైచి వాటిపై మూతులు ముక్కులు పోయియున్న బొమ్మలఁ జక్కపఱచి లోపలనున్న స్తంభముల కన్నింటికి రంగులు వైచి యుంచిరి. గోడలమీద జూచువారలు గుండెపగిలి చచ్చునంతటి భయంకరములగు బొమ్మల లిఖించుటయేగాక యట్టివే పటముల నందందు వ్రేలాడగట్టిరి. ఆవరణమందు దుబ్బువలెఁ బెరిగియున్న గడ్డినంతయు దోకి శుభ్రము చేసిరి. గజనీమహ్మదుచే నవయవ విహీనగఁ జేయఁబడిన కారణమునఁ గాబోలు స్వశరీర

63