ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సం యుక్త


గొనితెచ్చువారికి బహుమానము లియ్యబడునని చాటింపించెను. ఆ చాటింపు విని పలువురు బీదలు నగరము వెడలి యనేక గ్రామములు వెతకి యెచ్చోటనుం గానక తిరిగి వచ్చుచుండిరి. మఱికొందఱు రాకొమారికను గనుఁగొన కేల మరలిపోవలయునని పట్టుపట్టి మఱింత దూరదేశముల కేగుచుండిరి. రాణివాస మిట్టి దురవస్థనుండ నైదురాత్రులు గడచెను. ఒక్కరును సంయుక్త వార్తదేరైరి. అనుదినమునుఁ జూడనిదే ప్రాణముల నిలుప నోపనిరాణి తన ముద్దుకూతురు పోకడవలన మంచముపట్టి నిద్రాహారములుమాని యహోరాత్రము లొక్కతీరున విలపించుచుండెను. "హా ! కుమారీ! నవశిరీష కుసుమకోమలాంగి వగు నీ వెక్కడ నున్నావు? నిర్దయులారా! నాతో నొకమాటైనను వచింప కెచ్చటి కేగితివి? కట్టా ! నవమాసములు మోచి. కని, యింతపెద్దదాని గావించినందులకుఁ దుదకిదియా తల్లియెడ గనఁబఱచు కృతజ్ఞత. అయ్యో ! పున్నమచందురుబోలు నీ ముద్దుమో మింకెన్నడు కాంచగలను ? హా ! నా దౌర్భాగ్యము. నా ముద్దు కూన నెడబాసి నేనెట్లు ప్రాణముల భరింపగలను." అని గోలు గోలున వలవింపుచుండ నెల్లరుఁ జెంతఁజేరి యోదార్చుచుండిరి. జయచంద్రుడును బుత్రికావార్త తెలియనందున గొలువు కూటమున కేగుటమాని రాచకార్యము లన్నియుఁ జక్కబఱుప మంత్రి కాజ్ఞాపించి తా నంతఃపురంబువదలక చింతాసాగరమున మునిఁగి కూతురు సమాచార మెవరు కొనితెచ్చెదరా యని దినములు లెక్క పెట్టుకొనుచుఁ గాలము గడుపుచుండెను.

62