ఈ పుట ఆమోదించబడ్డది

ఎనిమిదవ ప్రకరణము


లెక్కడికైనఁ బోవుట చూచితిరా?" యని యచటి కావలి వారల నడుగ "అమ్మలారా రాత్రంతయు నిదే ప్రకారము గాచుకొనియున్నాము. మాకెవ్వరు గాన్పించలేదని" వచింప నందఱు సంభ్రమాక్రాంత హృదయులై వేవేగ నంతఃపురమున కేగి రాణికాసమాచార మెఱిఁగించిరి. ఆమెయుఁ దల్లడమంది లేచిపోయి జయచంద్రునకు విన్నవించ భయాకులుఁడై యేమి చేయుటకును గాలుసేతులాడక కోట నాల్గుమూలల వెదకించియు గార్యముగానక భటులఁ గొందఱ నన్నికడల పురము లోపల వెలుపల రోయఁబంచి.. యాందోళనమున సుండెను. రాణివాస మంతయు నల్లకల్లోల మగుచుండెను. ఈ సమాచార మప్పుడే నగరమంతట వ్యాపింపఁ బౌరజనంబు లెల్లరుసు విచారపడ సాగిరి. పట్టణమందలి జనంబు కెల్లరు నామె సుగుణములకును, విద్యకుసు, జక్కఁదనమునకును నావాసమని వేనోళ్ళ శ్లాఘింపు చుందురు. మఱియుఁ గాన్యకుబ్జమున రూపొంది వెలసిన లక్ష్మి యని భావించుచుందురు. పౌరులెల్లరు దమ స్వంతబిడ్డలు పోయినట్లు విలపింపసాగిరి. ఇక రాణియొక్క యవస్థ నేమని చెప్పనగు ! జయచంద్రు డించుక ధైర్యవంతు డగుటచే మంజరియు లేనందున వారిద్దరు గలిసి యెక్కడికో పోయియుందురనియు, నిరువురు గలసియున్నంతవరకు వారి కేయిక్కట్టులు సంభవింపవనియు నెంచుకొనుచుఁ గంటికి మంటికి నేకధారగా విలఫించుచున్న రాణినోదార్చి కొలువు కూటమునకేగి చారు లనేకుల నన్నిదిక్కుల వెతకఁబంపి పురమునం దంతట సంయుక్తను

61