ఈ పుట ఆమోదించబడ్డది

మొదటి ప్రకరణము


పోవుచుండెను. కావున బండ్లన్నియు సిపాయి లేర్పఱచుకొన్న మార్గముఁదప్పి యీవలావలఁ జెదరి నిలచియుండెను.

ఆ తరుణమునఁ దూర్పుదిక్కున నించుక మబ్బుపట్టి చల్లని వాయువులు వీవనారంభించెను. మేఘములు క్రమక్రమముగా వృద్ధియగుచున్నఁ గొలఁది గాలియు మిక్కుటమగు చుండెను. పరోపకారార్థము ఘనులుసల్పు కార్యములకు విఘ్నములు సంభవించుచుండుట ప్రస్తుతకాలమందుఁగూడ సహజమే యైయున్నదిగదా ! రానురాను గాలి ప్రబలమై మహాసత్వములగు వృక్షముల నల్లలనాడించుచుఁ దన ప్రకంపననామమును సార్థకఁ బఱచుకొనుచుండెను, అమితమగు నెండవేడిమివలనఁ గాలి యనేక జంతుసంచారములచే ద్రసరేణువులుగమారిన భూభాగమందలి ధూళియంతయు, ఝంఝానిల వశంబున నేలనంట వ్రాలి యూగులాడు తీగెలయొక్క రాపిళ్ళమూలమునఁ బైకిలేచి ప్రబలమగుచున్న జలదసంఘమును మఱింత దట్టముఁ జేయుచుండెను? పండి నేలరాలి యెండిపోయి యున్న యాకులన్నియు గాలిచేఁ గొట్టుకొనిపోవునపుడుఁ బుట్టు గలగలయను రొదలును, వెదురుమ్రాకు లొండొంటి తోడ నొరసికొని యుఱ్ఱూతలూగుతరిఁ గలుగు కిఱ్ఱుమను రావములును, నతి దీర్ఘములై చువ్వలంబలె మింటినంటఁ బెరిగిన వృక్షజాతులఁ జుమ్మను శబ్దములును, బవనవేగమునకు నిలువంజాలక విరిగి నేలంగూలు వివిధతరు శాఖాసమూహంబుల ఫెళఫెళారావములును, గాలితాకుడు వలన నత్యున్నతములుగలేచి నురుగులు,

7