ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


మలో పడుచుండ నేనింట సౌఖ్యముగ నుండ గలుగుదునా? నేనును దదన్వేషణార్థ మెచటికైనఁ బోయేదగాక యని దృఢచిత్తయై తత్క్షణంబ యాయుధాగారమున కేగి యటఁగల కొన్ని యుడుపులతోఁ బురుషవేషము వేసికొని లోపల నడుమున రెండు కత్తులఁ బదిలపఱచుకొని కావలివార లెవరును లేవకమున్నె యారామద్వారములన్ని యుఁ గడచి చింతాసాగరమున మునిగి తేలుచు నెక్కడికో పోయెను. అంతఁ గొంతవడికిఁ బక్షుల కలకలారావములు మిన్నుముట్టఁ జల్లని ప్రభాతవాయువులు మెల్లనవీవఁ దొడఁగెను. ముందు జరగఁబోవు రణమునందిట్లే రక్తసిక్తములగునని సూచించుభంగిఁ దూర్పుదిక్కునందలి యరుణ మరీచులు కన్యాకుబ్జ నగర ప్రాసాద తలముల పైఁ బ్రసరించు చుండెను. కావలివారెల్లరుఁ దమ్మునావేశించియున్న నిద్రా పిశాచముల నతికష్టముమీద వదలించుకొని ఖడ్గపాణులై జాగరూకత తోడ ద్వారముల గాచుచుండిరి. కాని రాత్రిజాము పరుండ బోవునపుడు మూసిన ద్వారము లిపుడు తెఱవబడిఁ యుండుటకేమి హేతువోయని యొక్కడైనఁ దలపడయ్యెను. అత్తరిఁ జెలికత్తెలెల్లరు మేల్కని సంయుక్త శయనమందిరములోనికేగి యామెఁ గానక మంజిరియు లేకుండుట వలన నిరువురు దమకన్న ముందుగాలేచి ప్రాతఃకాల వనవిహారమున కేగి యుందురను తలఁపున వారిఁగలిసికొనుటకై క్రిందికి వచ్చి తోటయందు బ్రవేశించి యన్నిమూలల వెదకి వారిఁ బొడగానక ద్వారములకడకేగి " ఓరీ ! మంజరీ సంయుక్త

60