ఈ పుట ఆమోదించబడ్డది

ఎనిమిదవ : ప్రకరణము


బొడగానరాని భయార్తయగుచు నేమియుఁ దోచక బిరబిర మేడనెక్కి ప్రతియంతస్థు నందును రోయుచు శయనమందిరము జేరి యచ్చోటను గానరానందున బొంగి వుచున్న ధుఃఖభారమున మొదలునఱకిన తరువువలె నిలువున నేలఁ గూలి... "హా : ప్రాణసఖీ ! నన్నొంటి దానింజేసి నీ వెచటికేగితివి? మనకు శరీరములు వేరైనను బ్రాణ మొక్కటియేయని ఇదివఱ కనేక మారులు వచించి యుంటివే. ఆయో?: సగము ప్రాణముతో బ్రోవ నీకు మససెట్లువచ్చెను. ఈ దుర్వార్త మీవారల కేమని వచింపుదు ? ప్రాతఃకాల మగునప్పటికి నీ తల్లిచనుదెంచి సంయుక్త యెక్కడని యడుగ నేమని చెప్పుదును? కట్టా! సంయుక్తను నా పొట్టను వైచుకొంటినని వచింపుదునా ! నా పై నింత కాటిన్యమేల పూనితివి. నీ సౌఖ్యమున కాశించియేగదా ! నీవు రమ్మనిన చోటికెల్ల వచ్చుచుంటిని. ఇయ్యెడనన్ను వెంటఁగొనిపోయిన నీయుద్దేశమునకుఁ బ్రతి బంధిక మగుదునని వదలి పోయితివా? హా! ఇంకెందు బోవుదాన” నని బిగ్గరగ నేడ్చిన వారు వీరు లేచివచ్చెదరను భయముస లోలోపలనే కృశింపుచు సముద్ర తరంగములపలె పొర్లి పొర్లి వచ్చుచున్న దుఃఖమున నేమిసేయుటకు దోపక మరల నారామము ప్రవేశించి వెదకిన చోటే వెదకుచు బిచ్చియెత్తిన దానివలె వనమంతట గలయం బరికించి మితిమీరిన శోకమున నటనుండ మనసొప్పక " హా ! నా ప్రాణపదమగు సంయుక్త నెడబాసి నేనేల యొంటరిగ నుండవలయును, నా నెయ్యంపుఁజెలి యెక్కడనో యే యిడు

59