ఈ పుట ఆమోదించబడ్డది

రాణిసంయుక్త

ప్రధముడు : అందులో నవతె రాజుకూతురు?

ద్వితీయుడు : అదియేమో నాకు తెలియదు.

ప్రధ : మఱేమి చేయుదము?

ద్వితీ : వారి మాటలవలనఁ గనుగొందము. నీ వించుక తాళియుండుము.

అనవాఁడేమియుఁ బలుకక నిలచియుండెను. అత్తరి సంయుక్త వదన మించుక వాడియుండుట దీపముల వెలుతురున గనుగొని మంజరి యిట్లనియె.

మంజరి : నెచ్చెలీ ! ఇప్పటికి రెండు గంటలు కావచ్చినవి. నీ కింకను నిద్రవచ్చుటలేదా ? నిద్రలేమి దేహమున "కెట్టి యనారోగ్యము కలుగునో యెఱుగవా? సకలమెఱిగిన విద్యావతివి. రాకొమారితవు నీవే యిట్లొనరించుచున్న నిఁక మా బోంట్లకు బుద్దులు గఱపువారెవరు ?

అన నదివరకె కొంచెము నిద్రవచ్చుచుండుట వలన మబ్బుమాటలతో సంయుక్త " చెలీ ! ఈ దినమున నాకేమో యారాటముగ నున్నదే. నా కోర్కె నెరవేర్చుదునని వచించి పోయిన నా గురువుగారి వార్త యించుకైనఁ దెలియలేదుగదా? అందుచే మఱింత పరితాపము కలుగుచున్నద"ని వచింపుచు నట్లే సోఫాపై బరుండి నిదురవోయేను. మంజరియు వనవిహారముచే బడలిక జెంది నిద్రించిన సంయుక్త నప్పుడే మేల్కొలు

58