ఈ పుట ఆమోదించబడ్డది

ఏడవ ప్రకరణము


జాలు విద్యుద్దీపములు పెట్టుటకనువగు సన్నని గొట్టము లడు గడుగున బెట్టబడియున్నవి. వెన్నెల దినములలో మంటపము లందలి దీపముల మాత్రమే వెలిగించుచుందురు. మఱియు నా యావరణమందు నాలుగువైపుల స్ఫటికశిలా వినిర్మితములగు కేళాకూళులు గలవు. ఇవి చిన్న చిన్న సోపానముల నొప్పి పూలవృక్షముల తొట్లచే గడు మనోహరముగ నుండును. ఈ నాల్గింటిలోపల దూర్పుపక్క నున్నది దట్టముగ దీగేలతో నల్లుకొని మనుష్యులు దాగియున్నను నగుపడకుండ జేయుచుండును. అట్టి యావరణమం దా యిరువురు గన్నియలు ప్రవేశించి మొదటిశాలల వరుసదాటి రెండవ శ్రేణియందలి కోతుల చేష్టల దర్శింపఁగోరి యొక మండపమునజేరి యొక సోఫాపై నాసీనులై వాటితోఁ జమత్కారముగ ముచ్చటించుచు నాడుకొనుచుండిరి. ఆ తరుణమున దీర్ఘ కాయుండగు నల్లని మానవుడొకడు పుట్టి గోచిని బెట్టుకొని శరీరమునిండ యాముదము కారుచుండఁ దీక్షణమగు మూరెడుపొడుగు గుదియ నొకదానిని చేతబట్టుకొని చూచువారలకు బ్రత్యక్ష యముఁడోయను భయము గలిగించుచు దూరుపు ప్రక్కనున్న కేళాకూళి మాటునకేగెను. తన యాకార వేషములతోఁ దులదూగగల మఱియొకని నటఁ గలసికొని యా మనుజుఁ డిట్లు మాటలాడసాగెను.

మొదటివాడు : అరే! వచ్చినటున్న దే ?

ద్వితీయుడు : ఆ: ఇన్ని దినములకు మన కష్టము లీడేరు సమయము వచ్చినది.

55