ఈ పుట ఆమోదించబడ్డది

రా ణీ సంయుక్త



నంబున కానందమందుచు నటకుఁ గొంచెము దూరముననున్న మాధవీలతా మంటపములోని కేగి యక్కడ నుండి వెడలి యుత్తరపు దిశనున్న లవలీలతో మంటపము బ్రవేశించి యా చేరువనున్న కప్పురంపు దిన్నెల యామోదమున కామోద మందుచు పిమ్మట బ్రాగ్దిశయందలి నవమల్లికా లతామంటపము జేరి యా ప్రాంతములనున్న సంపెంగ వనమునుండి వచ్చు కమ్మతావులకు సమ్ముదమంది యావలఁగడచి చలువరాలచే నిర్మింపబడి నిండు వెన్నెలలో నిగనిగలాడుచున్న కేళాకూళింజేరి జలయంత్రముల విడువ నించుకసేపటికి నీరునిండి వెల్లువయై పార దొడగెను . కొంతతడవు దానిగట్టుపై గూరుచుండి మృగములున్న వైపునకేగఁ దరలిరి. ఈ మృగశాల తోటయం దుత్తరమున నున్నది. తూర్పువైపు గోడనుండి పడమటికడ్డముగ వలయొకటి గట్టఁబడి యుండును. వలదాటి లోపలికిఁబోవ వరుసలుదీరియున్న శాలలనేకములు కాన్పించును. అందు మొదటి వరుసయందు సింహవ్యాఘ్రాది జంతువులును, రెండవవరుసయందు బలురకముల కోతిజాతులును, వాటికావల నానావిధ పక్షులును, తదనంతర మనేక సర్పజాతులును వేరువేరు శాలలయందుంచబడి యుండెను. ఇందు బ్రతిశాల కెదుట నంతఃపురస్త్రీలు గూరుచుండి జంతువుల చేష్టలు వీక్షించుటకై మంటపములు కట్టబడియున్నవి. ప్రతిమంటపములో దూగుటుయ్యెలలు, సోఫొలమర్పబడి యుండెను. తోటయందన్ని భాగములను మంటపములందును జంద్రకాంతులఁ గ్రిందుపఱుప

54