ఈ పుట ఆమోదించబడ్డది

ఏడవ ప్రకరణము


యక్కడనుండి క్రింది యంతస్థునకు దిగసాగిరి. ఈ క్రింది నికేతనము సంయుక్త ధరించునట్టి యమూల్యములగు వస్త్రాభరణ మందనములు గలిగి పై ప్రాసాదమున కెంతమాత్రము దీసిపోవకుండెను. అందుఁబ్రవేశింపకయే వారిద్దఱు దానికింది యంతస్థునకు దిగనారంభించిరి. ఇది సంయుక్త దేహపరిశ్రమఁ జేయునట్టిగది. ఎల్లప్పుడు ధరించునట్టి వస్త్రములుగాక యస్త్రవిద్య నలవరచుకొను తరి బ్రత్యేకముగ దాల్చునట్టి యుడుపు లనేకము లక్కడక్కడ వ్రేలాడు చుండెను. గోడలకొక వైపునఁ దళతళలాడు గత్తులును మఱియొక వైపున బందూకులు మొదలగునవి తగిలించి యుంచిరి. మొదట బేర్కొన్న ప్రాసాదమునకుంబలె దీని ముందు నొక విశాలమగు బహిరంగ ప్రదేశము గలదు. సంయుక్త దన చెలితో నందుఁ బ్రవేశించి వయ్యాళికేగునప్పుడు మామూలుగ ధరించునట్టి చేతికత్తినొక దానిఁగైకొని క్రింద యంతస్థునకు దిగసాగెను. ఈ క్రింది యంతస్థు సంయుక్త విద్యాభ్యాస మొనరించుకొను హర్మ్యము, వరుసలుగ దీర్పబడి బీరువాలు లెక్కింపనలవికాని గ్రంథరాజములఁ గూడుకొని యుండెను. సంయుక్త పుస్తకాగారముఁ బ్రవేశింపకయే దాని క్రింది యంతస్థునకు దిగి యట నిద్రాపరవశలై యున్న దాసీనికరంబుల కెఱుకరాకుండ మెల్లన నడుగు లిడుచు గ్రిందికిదిగి యటనుండి తోటలోనికిఁ బోవు తలుపు దెఱచుకొని వనములోని కేగి విరియఁబూచిన వెన్నెలలో మఱింత మనోహరములుగ నున్న బొండుమల్లియల విలా

53