ఈ పుట ఆమోదించబడ్డది

రాణి సంయుక్త


యీ జయచంద్రుని కూతురు. ఈమెయే మన కథానాయిక యగు “సంయుక్త" అట్లిరువురు, కన్నియలు గృహారామమున కేగ వెడలి యంతస్థునుండి సంయుక్త శయనమందిరములోనికి దిగిరి. ఈ గది విశాలమై చదరముగ నుండెను. ఆ భాగమునఁ దెల్ల పట్టుతానులతో చాందినీ యమర్పబడి యుండెను. క్రింద దలవరుసగ స్థాపించబడిన పటికంపురాలపై ముఖ్మల్‌మెత్త పరుపబడి యుండెను. చాందినీకి మూరెడు క్రిందుగ జిత్ర విచిత్రములగు గులోబులు, పెద్ద పెద్ద పాదరసపుబుడ్లు, మెఱపు దీపములుంచుట కనువగు నద్దపు గిన్నెలు వ్రేలాడుచుండెను. గోడలలోపలి భాగమంతయు నిర్మలనుగు నద్దముల కూర్పు గలిగి యుండెను. ఇవిగాక నానాదేశముల చిత్రపటముల నక్కడక్కడ వ్రేలాడ దీసియుంచిరి. మెత్తపై స్వదేశ పరదేశ నిర్మితములగు చలువరాల కుర్చీలు వట్రువబల్లలు, సోఫాలనేకములు అలంకరింపబడియుండెను. మందిరము నడిమి భాగమునఁ దూగు టుయ్యెలలును, వానిమధ్య హంసతూలికా తల్పమును నుండెను . ఈ ప్రాసాదము నాల్గువైపుల విశాలములగు కవాటములు గలిగి యుండెను. కవాటములనుండి బయటికేగ పిట్టగోడలచే నావృతమైన గొప్ప హర్మ్యోపరితలము గన్పించును. అందు బారులుగ దీర్పబడిన పలురకముల పూలచెట్ల తొట్లును వానిమధ్య భాగమున దీవెలతో దట్టముగ నల్లుకొనిపోయి లతాగృహమువలె నుండు చలువ పందిరియుఁ జూపరుల కాహ్లాదము గొలుపు చుండును. వారిరువురు గొంతవడి చలువ పందిరి వద్దఁ దిరిగి

52