ఈ పుట ఆమోదించబడ్డది

ఏడవ ప్రకరణము


జయచంద్ర జీవనసింహులిరువురు మైత్రిగలిగియుండి పరదేశములవారి నార్యావర్తము ద్రొక్కకుండ జేయుచువచ్చిరి. ఇటులుండ జీవనసింహుడు కారణములేకయే తన సేననంతయు హిమాలయా ప్రాంతములకనుప చౌహాణవైరాట్ వంశస్థుడగు పృథ్వీరాజు తన సేనతో నాకస్మికముగ డిల్లీపై దండెత్తి యారాజును నోడించి రాజ్యమును తనవశము చేసుకొనెను. ఈసంగతి జయచంద్రుడు తెలుసుకొని తన మిత్రుని జంపెననియు సామంతు డగువాడు చక్రవర్తి యయ్యెననియుఁ బృథివీరాజుపై గోపము నసూయనుబూని నాటినుండియు నతని చక్రవర్తిపదభ్రష్టుని జేయ గనుపెట్టుకొనియుండెను. చదువరులారా! మన యార్యావర్త మన్యులపాలగుట కివిరోధమే కారణము. మనదేశమున బాల్య వివాహములు సహగమనములు మొదలగునవి ప్రబలుట కీజయచంద్రుని మూర్ఖత్వమే కారణము. వేయేల? మనకుగల స్వాతంత్ర్యముల నన్నిటి నేటగలిపి యిట్టి యస్వాతంత్ర్యపు బ్రతుకు గలుగ జేసినదీ జయచంద్రునిఁ బట్టిన యసూయయే. పృధ్వీరాజుపై విరోధము నీర్ష్యయు వహింపక తనమూర్ఖపుబట్టును మానియుండిన యెడల మనమిట్టి దురవస్థకు వచ్చి యుండము. పూజనీయమై మునిజన నేవ్యమానమై విదేశీయ గణ్యమై ధనధాన్యరాసుల కాగారమై మహోన్నత పదవి యందుండిన నీయార్యావర్తము భ్రష్టముగావించి వదలిన మూడుడీ జయచంద్రుడేయని నొక్కి వక్కాణింపనగుమ. పై ప్రకరణమున సాధోపరి తలంబున విహరించి గృహారామమున కేగఁదలచిన కన్యక

51