ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


చుండెను. అట్టి సంధ్యాకాలమందు యమునానదికిం గొంచెము దూరములోనున్న మధురానగరమున కొకమైలు క్రిందుగా నది కొక ఫర్లాంగు యెడములోఁ గొన్ని బండ్లు నడచిపోవుచుండెను. బండ్లన్నియు నెద్దులు మోయగలిగినన్ని సరకు బస్తాలతో నింపఁబడి, వర్షము వచ్చిననుఁ దడియకుండుటకై యరచేతి మందములగు పెద్ద పెద్ద మైనపు గుడ్డలతోఁ గప్పఁబడి త్రాళ్ళచే బిగింపఁబడి యుండెను. ప్రతిబండి యొక్క పైభాగమునఁ దుపాకులఁ ద్రాళ్ళయందుదోపి నడుమునఁ గట్టుకొనియున్న బారుకత్తులు క్రిందికి వేలాడుచుండ నిద్దఱిద్దఱు సిపాయిలు పడియుండిరి. బండ్లవారంద ఱాసాయంకాలమున కుత్తుకనిండ ద్రాగిన సారాయి 'మైకమువలన నొడలు మఱచి తలలు వ్రాల్చు కొనిపోవ నూగులాడుచు మిట్టపల్లములుగా నున్న నేలపై నడచుచుండుటచే బండ్లదరిపడునపుడెల్ల దామును నదరిపడి లేచి యెడ్లనదలించుచుఁ దోలుకొని పోవుచుండిరి. పైభాగమునఁ బడియున్న సిపాయిలు సహితము వారితో సమానమగు నవస్థయం దుండుటచే, వారును దమకు మెలఁకువగల్గినపు డంతయు బండ్ల వారల నదలించుచుండిరి. రౌతు మెత్తనివాఁడైన గుఱ్ఱమొంటి కాలితో నడచుననురీతి వారందఱు నట్టిస్థితియందుండ నెద్దులెట్లు నడచుచుండినదియుఁ జదువరులే యూహింపఁగలరు. బండివాడు కోలతో దెబ్బఁదీసినపుడెల్ల రెండుమూఁ డడుగులు ముందుకు లాగుచు మిట్టవచ్చిన వెంటనే యాగిపోవుచుండెను, ఆగి పచ్చికమేత కాశపడి తమ యిష్టమువచ్చినట్లెల్లలాగికొని

6