ఈ పుట ఆమోదించబడ్డది

ఏడవ ప్రకరణము

పూర్వకాలమున నార్యావర్తమునందు ఢిల్లీనగరము తరువాత నంత ప్రసిద్ధికెక్కిన పట్టణము గన్యాకుబ్జనగరము. దీనినే యిప్పుడు "కనూజ్" యని వాడుచున్నారు. పండ్రెండవ శతాబ్దమునననగా మనచరిత్రకాలమున జయచంద్రుడనురాజు దానిఁ బాలించుచుండెను. ఇతడు సద్గుణవంతుడే కాని యొక్క దుర్గుణము మాత్రము కలిగియుండెను. ఆదుర్గుణమేదన దనప్రాణము మీదికి వచ్చుచున్నను లెక్కగొనక ముందువెన్క లరయక మంచిచెడ్డల విచారింపక తాబట్టిన మూర్ఖపు బట్టును నెగ్గించు కొనుట. అనేక సద్గుణగణ చంద్రతారావిరాజితుడయ్యు మౌర్ఖ్యమను ఘోరజీమూతసంఛన్నుండై మనదేశము నన్యులపాలబడ వైచిన దీమహాత్ముడే. ఇతడు రాజ్యముసేయు కాలమున డిల్లీని దీపసింహుని వంశస్థుడగు జీవనసింహుడు పరిపాలించుచుండెను.

50